Share News

వంటగది కొత్తగా...

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:48 AM

వంటగది చిన్నగా ఉన్నప్పటికీ విశాలంగా ప్రకాశవంతంగా కొత్తగా కనిపించాలంటే ఎలాంటి ఫ్లోర్‌ టైల్స్‌ను ఎంపిక చేసుకోవాలో చూద్దాం...

వంటగది కొత్తగా...

వంటగది చిన్నగా ఉన్నప్పటికీ విశాలంగా ప్రకాశవంతంగా కొత్తగా కనిపించాలంటే ఎలాంటి ఫ్లోర్‌ టైల్స్‌ను ఎంపిక చేసుకోవాలో చూద్దాం...

  • చదరంగం బోర్డును తలపించే నలుపు-తెలుపు టైల్స్‌ అమరిక వంటింటికి ప్రత్యేక శోభనిస్తుంది. తెలుపు, క్రీమ్‌, లేత బూడిద రంగు క్యాబినెట్లకు ఈ ఫ్లోర్‌ డిజైన్‌ చక్కగా సూటవుతుంది. గోడలకు ఎలాంటి అలంకరణలు, డిజైన్లు లేకపోయినా కిచెన్‌కు వింటేజ్‌ లుక్‌ వస్తుంది.

  • పూలు, ఆకులు, లతలు, తీగలతో కూడిన ఫ్లోర్‌ టైల్స్‌ వంటింట్లో అహ్లాదకరమైన అనుభూతినిస్తాయి. ఇలాంటి డిజైనరీ టైల్స్‌.. లేత నీలం, ఆకుపచ్చ, బేజ్‌, తెలుపు రంగుల క్యాబినెట్లకు క్లాసీ లుక్‌ను అందిస్తాయి. వీటివల్ల వంటగది అంతటా ప్రకృతి శోభ పరచుకుంటుంది.

  • కళాత్మకతపై ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు మొరాకో జ్యామితీ మోడల్‌ టైల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డైమండ్‌, స్టార్‌, యాంగ్యులర్‌ డిజైన్లతో రూపొందించిన టైల్స్‌ వంటగదిని ఆకర్షణీయంగా మార్చేస్తాయి. గోడలు, క్యాబినెట్లను వీలైనంత సాధారణంగా వదిలేస్తే ఫ్లోర్‌ కళ ఉట్టిపడుతుంది. అనేక రంగులతో గజిబిజిగా కాకుండా రెండు లేదా మూడు రంగులతో ఉన్న డిజైన్లను ఎంపిక చేసుకుంటే వంటగది విభిన్నంగా కనిపిస్తుంది.

  • టెర్రకోట రంగులతో కూడిన టైల్స్‌.. చిన్నప్పటి జ్ఞాపకాలను అందంగా ఆవిష్కరిస్తాయి. క్రీమ్‌, బేజ్‌, మ్యూటెడ్‌ బ్రౌన్‌ డిజైనరీ ఫ్లోర్‌ టైల్స్‌తో వంటింటికి సంప్రదాయ కళ వచ్చేస్తుంది. సాధారణ వుడ్‌ వర్క్‌తో రూపొందించిన క్యాబినెట్లు వీటి అందాన్ని మరింత పెంచుతాయి.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 24 , 2026 | 04:48 AM