ప్రతి పనినీ ఆస్వాదిస్తూ..
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:38 AM
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి నిమిషం ఒక టాస్క్‌లా మారిపోయింది. ఏ పని చేసినా తొందరపాటు, సమయానికి పరుగెత్తాలనే ...
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి నిమిషం ఒక టాస్క్‌లా మారిపోయింది. ఏ పని చేసినా తొందరపాటు, సమయానికి పరుగెత్తాలనే టెన్షన్ మహిళలను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసిపోయేలా చేస్తున్నాయి. ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికే ప్రపంచవ్యాప్తంగా ‘స్లో లివింగ్’ కాన్సెప్ట్ విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది. అంటే ప్రతి పనినీ ఆస్వాదిస్తూ, ప్రశాంతంగా, మనసారా చేయడం అన్నమాట.
అది నిర్లక్ష్యం కాదు: స్లో లివింగ్ అనగానే సోమరితనం అని భావించకూడదు. ఇది పనులను వాయిదా వేయడం కాదు, చేసే ప్రతి పనిలోనూ నాణ్యతను, ఆనందాన్ని వెతుక్కోవడం. ఉదయం పూట హడావుడిగా కాఫీ తాగే బదులు, ఆ అరుదైన క్షణాలను ఆస్వాదించడం, వంట చేసేటప్పుడు రుచిని మనసారా అనుభవించడం దీని ప్రత్యేకత.
మల్టీ టాస్కింగ్‌కు స్వస్తి.. : ఒకే సమయంలో పది పనులు చేయాలనే ‘మల్టీ టాస్కింగ్’ భారాన్ని తగ్గించుకుని, ఒకసారికి ఒకే పనిపై పూర్తి దృష్టి పెట్టడం ఈ జీవన శైలి ప్రధాన సూత్రం. ఇది ఏకాగ్రతను పెంచడమే కాకుండా మెదడుపై పడే అనవసరమైన భారాన్ని తగ్గిస్తుంది.
ప్రశాంతమైన మానసిక స్థితికి బాటలు.. : ఈ విధానాన్ని అలవరుచుకోవడం ద్వారా మహిళలు తమ దైనందిన జీవితంలో అనవసరమైన ఆందోళనలను దూరం చేసుకోవచ్చు. పరిగెత్తే కాలంలో కాస్త నిలకడగా శ్వాస తీసుకుంటూ, వర్తమాన క్షణంలో బతకడాన్ని నేర్పించే ఈ అద్భుతమైన ట్రెండ్ మహిళల మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్