నిద్ర లేమితో అధిక కొలెస్ట్రాల్
ABN , Publish Date - May 26 , 2026 | 03:26 AM
సాధారణంగా కొలెస్ట్రాల్‌ను ఆహారంతో ముడిపెడుతూ ఉంటాం. అయితే అధిక కొలెస్ట్రాల్ మోతాదులకూ నిద్రలేమికీ అవినాభావ సంబంధం ఉంటుందంటున్నారు...
మీకు తెలుసా?
సాధారణంగా కొలెస్ట్రాల్‌ను ఆహారంతో ముడిపెడుతూ ఉంటాం. అయితే అధిక కొలెస్ట్రాల్ మోతాదులకూ నిద్రలేమికీ అవినాభావ సంబంధం ఉంటుందంటున్నారు వైద్యులు నిద్రలేమితో కార్టిసాల్ హార్మోన్ మోతాదు పెరుగుతుంది. ఈ హార్మోన్ కాలేయాన్ని అధిక కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తుంది. అలాగే కంటి నిండా నిద్ర లోపించడం వల్ల, ఎల్‌డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ ప్రభావితమై, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది. ఆహార నియమాలు, వ్యాయామాలు పాటించినా అదుపులోకి రాని మొండి కొలెస్ట్రాల్ మోతాదులు, కంటి నిండా నిద్రతో అదుపులోకొస్తున్నట్టు వైద్యులు గమనిస్తున్నారు. కాబట్టి రోజుకు కనీసం 6 నుంచి 7 గంటలకు తగ్గకుండా నిద్రపోయే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో ఆహార నియమాలను కూడా పాటిస్తూ ఉండాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..