Share News

చర్మ సమస్యలకు చెక్‌...

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:55 AM

ఒక్కోసారి చర్మంపై ఏర్పడే గజ్జి, తామర, అలెర్జీ, దురద తదితర సమస్యలను నివారించే ఇంటి చిట్కాలివే...

చర్మ సమస్యలకు చెక్‌...

ఒక్కోసారి చర్మంపై ఏర్పడే గజ్జి, తామర, అలెర్జీ, దురద తదితర సమస్యలను నివారించే ఇంటి చిట్కాలివే...

  • అయిదు కర్పూరం బిళ్లలను తీసుకుని పొడిలా చేసి అందులో కొద్దిగా నిమ్మరసాన్ని రెండు చుక్కల కొబ్బరి నూనె లేదా గులాబీ నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట పలుచగా రాసి అయిదు నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. కర్పూరంలోని ఔషధ గుణాలు హానికారక బ్యాక్టీరియాలను నాశనం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా మార్చేస్తాయి. నిమ్మరసంలోని సిట్రికామ్లం చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఈ కర్పూరం మిశ్రమంతో మొటిమలు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, నల్లమచ్చలు తగ్గి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

  • కలబంద గుజ్జును అలెర్జీ ఉన్న చోట అప్లయ్‌ చేసి పావు గంట తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే దురద, మంట, వాపు తగ్గుతాయి. కలబంద లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ వ్యాధులను పూర్తిగా నయం చేస్తాయి.

  • తులసి లేదా వేపాకులను మెత్తగా నూరి ఆ పేస్టును సమస్య ఉన్న చోట రాస్తే వ్యాధి కారక క్రిములు నశించిపోతాయి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, దురద నుంచి ఉపశమనం లభిస్తుంది.

  • గిన్నెలో రెండు చెంచాల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, రెండు చెంచాల మంచినీటిని వేసి కలిపి అందులో ముంచిన దూదితో అద్దుతుంటే క్రమంగా చర్మ సమస్యలు తీరుతాయి.

  • రెండు మూడు ఐస్‌ క్యూబ్స్‌ను పలుచని రుమాలులో చుట్టి దానితో అద్దుతుంటే మొటిమలు, ఇతర అలెర్జీల కారణంగా వచ్చే నొప్పి, వాపు తగ్గుతాయి.

ఈ వార్తలూ చదవండి

దుబాయ్‌-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..

దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు..

Updated Date - Oct 01 , 2026 | 01:55 AM