Share News

గుంటలు మాయం ఇలా...

ABN , Publish Date - Jun 15 , 2026 | 01:33 AM

మొటిమలు, గుల్లలు లాంటి వాటివల్ల చర్మంపై చిన్న చిన్న గుంటలు ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించి చర్మాన్ని నున్నగా మెరిపించే ఇంటి చిట్కాలివే...

గుంటలు మాయం ఇలా...

మొటిమలు, గుల్లలు లాంటి వాటివల్ల చర్మంపై చిన్న చిన్న గుంటలు ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించి చర్మాన్ని నున్నగా మెరిపించే ఇంటి చిట్కాలివే...

  • ఐస్‌క్యూబ్‌ను పలుచని చేతి రుమాలులో చుట్టి దానితో ముఖంపై సున్నితంగా మర్దన చేయాలి. ఈ ఐస్‌క్యూబ్‌ థెరపీ వల్ల రంధ్రాలు మూసుకుని చర్మం బిగుతుగా మారుతుంది.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల ముల్తానీ మట్టిని తీసుకుని అందులో తగినన్ని గులాబీనీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటసేపు ఆరనిచ్చి తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే క్రమంగా చర్మం నున్నగా మారుతుంది.

  • అర కప్పు చల్లటి గ్రీన్‌ టీలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. దూది వుండ సహాయంతో ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • ఒక గిన్నెలో పావు కప్పు శనగపిండి, పావు కప్పు పెరుగు, రెండు చెంచాల ఆలివ్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముడుతలు, గీతలు, రంధ్రాలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

  • రాత్రి పడుకునేముందు ముఖానికి కలబంద గుజ్జు లేదా టమాటా గుజ్జు పట్టించి ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.

  • ఉదయాన్నే ముఖానికి కోడిగుడ్డు తెల్ల సొన లేదా కొద్దిగా యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ముఖానికి రాసి ఆరాక గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

  • ఎండలో బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి సన్‌స్ర్కీన్‌ రాసుకోవాలి. పాల ఉత్పత్తులు, స్వీట్లు, నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల చర్మంపై సెబమ్‌ ఉత్పత్తి పెరిగి చర్మ రంధ్రాలు పెద్దవవుతాయి. తరచూ మంచినీటిని తాగుతూ ఉంటే సమస్య తీరుతుంది.

ఇవి కూడా చదవండి..

ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..

మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..

Updated Date - Jun 15 , 2026 | 01:33 AM