Share News

సైనసైటి్‌సతో కంటికి కీడు

ABN , Publish Date - May 21 , 2026 | 04:31 AM

కంటి కింద, పైన, ముక్కుకు ఇరువైపులా సైన్‌సలు ఉంటాయి. వీటికి ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు చికిత్స తీసుకోవడంతో పాటు, పదే పదే సైనసైటిస్‌ వేధిస్తున్నప్పుడు...

సైనసైటి్‌సతో కంటికి కీడు

కౌన్సెలింగ్‌

సాధారణ సైనస్‌, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌గా మారి, కంటి మీద ప్రభావాన్ని కనబరచడం మొదలుపెట్టిందని ఇటీవల, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, పవన్‌ కల్యాణ్‌ చేసిన ఒక ప్రకటన నన్ను ఆకర్షించింది. నిజానికి నేను కూడా సైన్‌సతో బాధపడుతున్నాను. వైద్యులు సర్జరీ సూచించినా జాప్యం చేస్తున్నాను. సైన్‌సతో ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో వివరిస్తారా?

ఒక సోదరి, హైదరాబాద్‌

కంటి కింద, పైన, ముక్కుకు ఇరువైపులా సైన్‌సలు ఉంటాయి. వీటికి ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు చికిత్స తీసుకోవడంతో పాటు, పదే పదే సైనసైటిస్‌ వేధిస్తున్నప్పుడు వైద్యులు సూచించిన సర్జరీని ఆశ్రయించాలి. సైన్‌సను నిర్లక్ష్యం చేసినప్పుడు అది కంటి వరకూ వ్యాపించి, నాడిని సైతం దెబ్బతింటుంది. ప్రారంభంలో కంటి చుట్టూ నొప్పి, కంటిచూపు మసకబారడం, ఒకటి రెండులా కనిపించడం, కనుగుడ్డు తిప్పే సమయంలో నొప్పి మొదలైన లక్షణాలు మొదలవుతాయి. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు మొదట ‘ఫంక్షనల్‌ ఎండొస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ’ (ఎఫ్‌ఈ్‌సఎస్‌) చేసి, తర్వాత ‘ఆర్బిటల్‌ డికంప్రెషన్‌’ చేయాల్సి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్‌ కంటి నాడిని కూడా ప్రభావితం చేసిన సందర్భాల్లో ‘ఆప్టిక్‌ నర్వ్‌ డికంప్రెషన్‌’ కూడా చేయాల్సి రావచ్చు. కాబట్టి సైనసైటిస్‌ వేధిస్తున్నప్పుడు, సకాలంలో చికిత్స తీసుకోవాలి. లేదంటే అది కంటి వరకూ వ్యాపించి, కంటి చూపును దెబ్బతీస్తుంది. కనుగుడ్డుతో పాటు నాడులు దెబ్బతిన్నప్పుడు కంటి చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సాఽధారణంగా ప్రజల్లో సైనసైటిస్‌ పట్ల కొన్ని అపోహలుంటాయి. అలర్జీలా పదే పదే సైనసైటిస్‌ తలెత్తుతున్నప్పుడు, సర్జరీ చేయించుకోవలసిన అవసరం లేదని భావిస్తూ ఉంటారు. కానీ సైనసైటి్‌సతో తలెత్తే తీవ్ర పరిణామాలను, అన్ని సందర్భాల్లో తిరిగి సరిదిద్దే వీలు ఉండకపోవచ్చు.


కాబట్టి ప్రారంభంలోనే సైనసైటి్‌సకు సమర్థమైన చికిత్స తీసుకోవాలి.

ఫంక్షనల్‌ ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ

పదే పదే సైనసైటిస్‌ వేధిస్తున్నప్పుడు వైద్యులు ఆశ్రయించే సర్జరీ ఇది. సైన్‌సలో పేరుకునే ఇన్‌ఫెక్షన్‌ ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోవడానికి వీలుగా ఏర్పరిచే మార్గంగా ఈ సర్జరీని భావించవచ్చు. నోటి మాత్రలు, స్ర్పేలతో సైనసైటిస్‌ అదుపులోకి రానప్పుడు, వైద్యులు సూచించే ఈ సర్జరీని తప్పక చేయించుకోవాలి. సర్జరీ ద్వారా సైన్‌సలను తెరిచి ఉంచడం వల్ల, అవి ఎప్పటికప్పుడు ఖాళీ అవుతూ, ఇన్‌ఫెక్షన్‌కు అవకాశం లేకుండా పోతుంది. ఈ సర్జరీ గురించి కూడా ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది. సర్జరీతో సైనసైటి్‌సకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ సర్జరీ తర్వాత కూడా అలర్జీలు, జలుబుల వల్ల సైనసైటిస్‌ తలెత్తవచ్చు. అయినప్పటికీ కేవలం ఒక స్ర్పేతో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవచ్చు. సర్జరీతో సైన్‌సలు తెరుచుకుని ఉంటాయి కాబట్టి నేసల్‌ స్ర్పే నేరుగా సైన్‌సలు అన్నింటికీ చేరుకుని, ఉపశమనాన్ని కలిగిస్తుంది. సమస్యను సులభంగా పరిష్కరిస్తుంది.

డాక్టర్‌ సుధీర్‌రెడ్డి తళ్లపురెడ్డి

కన్సల్టెంట్‌ ఈన్‌టి, హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జన్‌,

త్రీ సెన్సెస్‌ ఈన్‌టి స్పెషాలిటీ క్లినిక్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి

అత్తాపూర్ కిడ్నాప్‌ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి

శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుపడిన హైగ్రేడ్ గంజాయి..

Updated Date - May 21 , 2026 | 04:31 AM