మీ కోసం అరగంట
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:55 AM
ఇల్లు, ఆఫీసు, పిల్లల బాధ్యతలు.. ఇలా రోజంతా యాంత్రికంగానే సాగే జీవితంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు...
ఇల్లు, ఆఫీసు, పిల్లల బాధ్యతలు.. ఇలా రోజంతా యాంత్రికంగానే సాగే జీవితంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. అందరి క్షేమం కోరే మహిళ.. తన క్షేమం కోసం కూడా శ్రద్ధ వహించినప్పుడే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.
ఆరోగ్యం అనగానే శారీరక దృఢత్వం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం. ముప్పై ఏళ్లు దాటిన మహిళలు తమ ఆహారంలో కాల్షియం, ఐరన్ తగినంత ఉండేలా చూసుకోవాలి. ఎముకల పుష్టి కోసం పాలు, ఆకు కూరలు డైట్‌లో చేర్చుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా చేయడంవల్ల రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా నెలసరి సమస్యలు లేదా నీరసం వంటివి అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
మానసిక ఆరోగ్యం కోసం
ప్రతి రోజు కనీసం 15 నిమిషాల పాటు మీకు నచ్చిన పని (సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, తోటపని) చేయండి. దీనిని మీ టైం అనుకోండి. ఇది మీ ఒత్తిడిని తగ్గించి రీచార్జ్ చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగడం, సరిగా నిద్రపోవడం వంటి చిన్నచిన్న మార్పులు చర్మ సౌందర్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి.
ఇవి కూడా చదవండి...
ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?
Read Latest Telangana News And Telugu News