బరువు తగ్గాలా...
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:15 AM
కఠినమైన ఆహార నియమాలు, గంటల కొద్దీ వ్యాయామాలతో పని లేకుండా చిన్న చిట్కాలతో శరీర బరువును ఎలా అదుపులో ఉంచుకోవచ్చో చూద్దాం...
కఠినమైన ఆహార నియమాలు, గంటల కొద్దీ వ్యాయామాలతో పని లేకుండా చిన్న చిట్కాలతో శరీర బరువును ఎలా అదుపులో ఉంచుకోవచ్చో చూద్దాం...
చదువుకునేటప్పుడు లేదా ఆఫీసులో పనిచేసేటప్పుడు గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి అలా వాకింగ్ చేయడం, కూర్చునే కాళ్లు చేతులతో చిన్నపాటి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకుంటే శరీరంలో కదలికలు పెరిగి మంచి ఫలితం కనిపిస్తుంది.
తరచూ లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కడం, దిగడంతోపాటు చిన్న పనికి కూడా బైక్ లేదా కారు తీసే బదులు నడచి వెళ్లడం లాంటివి బరువు తగ్గడానికి ఉపకరిస్తాయి.
మధ్యాహ్నం, రాత్రి భోజనాల తరువాత కనీసం పావుగంటసేపు నడవడం వల్ల శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వులు కరిగిపోతాయి. చురుకుదనం, ఉత్సాహం పెరుగుతాయి.
వారానికి కనీసం రెండున్నర గంటలు వ్యాయామానికి కేటాయించాలి. రోజూ చిన్న చిన్న సెషన్లుగా ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడం ప్రయోజనకరం.
ఫోన్లో మాట్లాడేటప్పుడు అటూ ఇటూ నడవడం, టీవీ చూసేటప్పుడు మధ్య మధ్యలో చిన్న పనులను చక్కబెట్టడం అలవాటు చేసుకుంటే ఫలితం ఉంటుంది.
నూనె పదార్థాలు, స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు బదులు తరచూ తాజా పండ్లు, మొలకలు, డ్రై ఫ్రూట్స్, కేరట్లు, కీర, ఉడికించిన గుడ్లు తీసుకుంటుంటే శరీర బరువు అదుపులో ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు