డౌన్ సిండ్రోమ్‌కు చెల్లుచీటీ
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:53 AM
మనం ఇప్పటివరకూ డౌన్ సిండ్రోమ్‌ను సరిదిద్దే వీల్లేని శాశ్వత జన్యు సమస్యగా భావించాం. కానీ తాజాగా శాస్త్రవేత్తలు క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ సహాయంతో మానవ కణాల్లో...
పరిశోధన
మనం ఇప్పటివరకూ డౌన్ సిండ్రోమ్‌ను సరిదిద్దే వీల్లేని శాశ్వత జన్యు సమస్యగా భావించాం. కానీ తాజాగా శాస్త్రవేత్తలు క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ సహాయంతో మానవ కణాల్లో డౌన్స్ సిండ్రోమ్‌కు కారణమయ్యే అదనపు క్రోమోజోమ్‌ను తొలగించగలిగారు. మరిన్ని వివరాలు...
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 700 మంది పిల్లల్లో ఒకరు డౌన్స్ సిండ్రోమ్‌తో పుడుతూ ఉంటారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు, ఇందుకు కారణమయ్యే 21వ క్రోమోజోమ్‌ను విజయవంతంగా తొలగించగలిగారు. క్రిస్పర్ టీన్ ఎడిటింగ్ పద్ధతి ద్వారా, డౌన్ సిండ్రోమ్‌కు గురైన వ్యక్తుల నుంచి సేకరించిన స్కిన్ ఫైబ్రోబ్లాస్ట్స్‌తో పాటు, మూల కణాలు, ప్రయోగశాలలో పెంచిన కణాల నుంచి వ్యాధికారక క్రోమోజోమ్‌ను తొలగించి, సాధారణ క్రోమోజోమ్ సంఖ్యను పనరుద్ధరించగలిగారు. అయుతే సజీవ వ్యక్తి నుంచి క్రోమోజోమ్‌ను తొలగించడం వల్ల జన్యునష్టంతో పాటు జన్యు ఉప్పరివర్తనాల ముప్పు పెరుగుతుంది కాబట్టి మనుషుల మీద ప్రయోగాలు చేపట్టి, సత్ఫలితాలను రాబట్టవలసి ఉందని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతమై, జీన్ ఎడిటింగ్ మరింత పురోగతి సాధించగలిగితే, డౌన్స్ సిండ్రోమ్‌తో పాటు ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, పాలా సిండ్రోమ్ లాంటి మరిన్ని జన్యుపరమైన వ్యాధులను కూడా పరిష్కరించవచ్చని, శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం