బియ్యం ఇలా కడగాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:59 AM
మిగతా పదార్థాలతో పోల్చితే, బియ్యంలో ఆర్సెనిక్ పది రెట్లు ఎక్కువ ఉంటుంది. దాన్ని వదిలించాలంటే బియ్యాన్ని నీళ్లతో కడిగితే సరిపోదు...
ఇదీ విషయం
మిగతా పదార్థాలతో పోల్చితే, బియ్యంలో ఆర్సెనిక్ పది రెట్లు ఎక్కువ ఉంటుంది. దాన్ని వదిలించాలంటే బియ్యాన్ని నీళ్లతో కడిగితే సరిపోదు.
ఆర్సెనిక్ బియ్యం గింజల పైన పైపొరలా పేరుకోదు. అది గింజ లోపల తిష్ఠ వేసుకుని ఉంటుంది. కాబట్టి బియ్యం కడగడానికి బదులుగా ఉడికించి, వార్చేయాలి. అందుకోసం మొదట నీళ్లు మరిగించాలి. తర్వాత ఆ నీళ్లలో బియ్యం వేసి, ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత నీళ్లు వార్చేస్తే, ఆ నీళ్లతో పాటు ఆర్సెనిక్ కూడా వెళ్లిపోతుంది. తర్వాత మళ్లీ నీళ్లు జోడించి, చిన్న మంట మీద ఆ నీళ్లు ఇగిరిపోయేవరకూ అన్నం ఉడికించుకోవాలి. 2021లో ఆర్సెనిక్‌ను వదిలించుకోవడం బియ్యాన్ని శుభ్రం చేసే విధానాల గురించి పరిశోధకులు పరిశోధన చేశారు. ఇందుకోసం ఆరు రకాల బియ్యాలను ఉపయోగించినప్పుడు, ఈ విఽధానం ద్వారా 73ు ఆర్సెనిక్‌ను వదిలించడంతో పాటు, బియ్యంలోని పోషకాలు నష్టపోకుండా నియంత్రించగలిగారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest, Telangana News And National News