Share News

రాగి జావ తాగుదాం రండి

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:28 AM

వేసవిలో రాగి జావకు మించినది లేదు. దీన్ని ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు. రాత్రి పడుకునేముందు కూడా తాగవచ్చు. ఇందులో కొద్దిగా పెరుగు లేదా...

రాగి జావ తాగుదాం రండి

వేసవిలో రాగి జావకు మించినది లేదు. దీన్ని ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు. రాత్రి పడుకునేముందు కూడా తాగవచ్చు. ఇందులో కొద్దిగా పెరుగు లేదా పలుచని మజ్జిగ కలుపుకుని తాగితే దాహార్తి తగ్గుతుంది. రాగి జావ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

  • రాగుల్లో పీచులు, ప్రొటీన్లు, ఐరన్‌ తదితర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకు ఒకసారి రాగి జావ తాగితే జీవక్రియలు సాఫీగా జరుగుతాయి. శరీరంలో రక్తం ఉత్పత్తి పెరుగుతుంది. అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

  • రాగి జావలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రిస్తాయి.

  • రాగి పిండిలో ఉండే సి విటమిన్‌.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది.

  • రాగి పిండిలో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజూ చిన్న గ్లాసు రాగి జావ తాగితే ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. పిల్లల ఎదుగుదలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

  • రాగి జావ త్వరగా జీర్ణమవుతుంది. దీంతో తక్షణ శక్తి లభిస్తుంది. కడుపులో చల్లగా ఉన్న భావన కలుగుతుంది.

  • రాగి జావ తయారీ: చిన్న గిన్నెలో రెండు చెంచాల రాగిపిండి వేసి అందులో కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ గరిటె జారుగా కలుపుకోవాలి. ఉండలు రాకుండా చూసుకోవాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి మూడు గ్లాసుల నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు వేడెక్కాక రాగి పిండి మిశ్రమం పోసి కలపాలి. రెండు నిమిషాలు ఉడకనిచ్చి ఆపైన రాగిజావను గ్లాసుల్లో పోసి సర్వ్‌ చేయడమే!

ఇవి కూడా చదవండి..

నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు

Updated Date - Mar 12 , 2026 | 04:28 AM