Share News

మగ్‌ కేక్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:44 AM

సపోటా పండు- ఒకటి, ఓట్స్‌ పొడి- రెండు చెంచాలు, మైదా- చెంచా, పంచదార లేదా బెల్లం పొడి- ఒకటిన్నర చెంచాలు, బేకింగ్‌ పౌడర్‌- పావు చెంచా, బేకింగ్‌ సోడా- చిటికెడు...

మగ్‌ కేక్‌

సపోటా

కావాల్సిన పదార్థాలు

సపోటా పండు- ఒకటి, ఓట్స్‌ పొడి- రెండు చెంచాలు, మైదా- చెంచా, పంచదార లేదా బెల్లం పొడి- ఒకటిన్నర చెంచాలు, బేకింగ్‌ పౌడర్‌- పావు చెంచా, బేకింగ్‌ సోడా- చిటికెడు, పెరుగు- చెంచా, వెన్న- చెంచా, పాలు రెండు చెంచాలు, వెనీలా ఎస్సెన్స్‌- రెండు చుక్కలు, చాక్లెట్‌ చిప్స్‌- కొన్ని, నట్స్‌- కొన్ని, చాక్లెట్‌ సిరప్‌- చెంచా

తయారీ విధానం

ఓట్స్‌ను దోరగా వేయించి మెత్తటి పొడిలా చేసుకోవాలి. బ్లెండర్‌లో సపోటా పండు ముక్కలు వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. వెడల్పాటి గిన్నెలో ఓట్స్‌ పొడి, మైదా, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, పంచదార లేదా బెల్లం పొడి వేసి బాగా కలపాలి. తరువాత సపోటా పండు పేస్టు, పాలు, వెన్న, పెరుగు, వెనీలా చుక్కలు వేసి ఉండలు రాకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక మగ్‌లోకి తీసుకుని పైన చాకో చిప్స్‌, నట్స్‌ వేయాలి. ఈ మగ్‌ని మైక్రోవేవ్‌లో మూడు నిమిషాలపాటు ఉంచాలి. తరువాత మగ్‌ని బయటికి తీసి చాక్లెట్‌ సిరప్‌తో అలంకరించి వేడిగా లేదా చల్లగా సర్వ్‌ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

Updated Date - Feb 28 , 2026 | 12:44 AM