గుమ్మడి గింజలు తిందాం
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:42 AM
గుమ్మడి గింజలను రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
గుమ్మడి గింజలను రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
గుమ్మడి గింజలను నేరుగా, నేతిలో వేయించుకుని, నీటిలో నానబెట్టుకుని తినవచ్చు.
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడి మధుమేహాన్ని నియంత్రణలోకి తెస్తాయి. ఎముకల్లో సాంద్రతను పెంచుతాయి. కండరాలకు బలాన్ని అందిస్తాయి. కీళ్ల నొప్పులకు ఔషధంలా పనిచేస్తాయి.
రోజూ పిడికెడు గుమ్మడి గింజలను తింటుంటే వాటిలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం.. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి లాంటి సమస్యలు తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది.
వీటి నుంచి లభించే ఇ విటమిన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. శిరోజాలు ఒత్తుగా పెరగడానికి తోడ్పడతాయి. చర్మ సమస్యలను నివారిస్తాయి.
గుమ్మడి గింజల్లో ఉండే ప్రోటీన్లు, పీచు.. శరీర బరువును అదుపులో ఉంచుతాయి.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు.. తక్షణ శక్తిని అందించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జలుబు, దగ్గు, అలసట, నీరసం లాంటివి దరిచేరవు.
ఉదయం అల్పాహారంలో కొన్ని గుమ్మడి గింజలను చేర్చుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు మాయమవుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా