తల్లి నుంచి బిడ్డకు ఆహారపుటలవాట్లు
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:51 AM
గర్భిణి తినే పదార్థాల మీదే పుట్టబోయే పిల్లల ఆహారపుటలవాట్లు ఆధారపడి ఉంటాయనే ఒక పరిశోధన తాజాగా వెలుగులోకొచ్చింది. డర్హమ్ యూనివర్శిటీలో చేపట్టిన ఒక పరిశోధనలో...
మీకు తెలుసా?
గర్భిణి తినే పదార్థాల మీదే పుట్టబోయే పిల్లల ఆహారపుటలవాట్లు ఆధారపడి ఉంటాయనే ఒక పరిశోధన తాజాగా వెలుగులోకొచ్చింది. డర్హమ్ యూనివర్శిటీలో చేపట్టిన ఒక పరిశోధనలో భాగంగా, గర్భిణులతో పాటు, వాళ్లకు పుట్టిన పిల్లలను మూడేళ్ల వయసొచ్చే వరకూ పరిశీలించిన పరిశోధకులు కొన్ని ఆసక్తికరమైన అంశాలను పరిశీలించారు. గర్భిణిగా ఉన్న సమయంలో తల్లి తిన్న కొన్ని ఆహార పదార్థాలను, ఆమెకు పుట్టిన బిడ్డ కూడా ఇష్టంగా తింటున్నట్టు పరిశోధకులు కనిపెట్టారు. సాధారణంగా కొందరు పిల్లలు కొన్ని కూరగాయల పట్ల అయిష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే, గర్భిణిగా ఉన్న సమయంలో అన్ని కూరగాయలనూ తింటూ ఉండాలి. ఇలా కూరగాయల రుచులను గర్భిణిగా ఉన్నప్పుడే కడుపులో పెరిగే బిడ్డకు అలవాటు చేయడం వల్ల, పుట్టిన తర్వాత ఆ కూరగాయలన్నిటినీ ఇష్టంగా తింటారనీ, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను గర్భస్థ దశలోనే పుట్టబోయే పిల్లలకు అలవాటు చేయొచ్చనీ ఈ పరిశోధన నిరూపిస్తోంది.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం