Share News

స్నానం చేసేముందు...

ABN , Publish Date - Jun 15 , 2026 | 02:48 AM

స్నానానికి వెళ్లేముందు ఏం చేస్తే చర్మం చక్కగా నిగారిస్తుందో తెలుసుకుందాం...

స్నానం చేసేముందు...

స్నానానికి వెళ్లేముందు ఏం చేస్తే చర్మం చక్కగా నిగారిస్తుందో తెలుసుకుందాం...

  • స్నానం చేయడానికి పావు గంట ముందు ఒంటికి కొబ్బరి నూనె లేదా బాదం నూనె రాసుకుని సున్నితంగా మర్దన చేసుకోవాలి. దీనివల్ల చర్మం పొరల్లో తేమ నిలుస్తుంది. రక్తప్రసరణ మెరుగై చర్మం కాంతులీనుతుంది.

  • చిన్న గిన్నెలో నాలుగు చెంచాల శనగపిండి, చెంచా పసుపు, తగినంత పెరుగు వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్లకు పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత మెల్లగా మర్దన చేస్తూ పిండిని తొలగించాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.

  • శరీరాన్ని డ్రై బ్రష్‌ సహాయంతో సున్నితంగా రుద్దాలి. దీనివల్ల చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మోచేతులు, పాదాలు, మడమలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

  • గోరు వెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయాలి. పావుగంట లోపు స్నానం పూర్తిచేయాలి. లేదంటే చర్మంపై సహజంగా ఉండే నూనెలు తొలగిపోతాయి. దీంతో చర్మం పొడిబారి అందవిహీనంగా కనిపిస్తుంది.

  • స్నానానికి వెళ్లే ముందు ముఖానికి, కళ్లకు, పెదవులకు ఉన్న మేకప్‌ను పూర్తిగా తొలగించాలి. అప్పుడే చర్మం ఆరోగ్యకరమైన రీతిలో శుభ్రమవుతుంది.

  • తల స్నానం చేయడానికి ముందు శిరోజాలను దువ్వెనతో దువ్వుతూ చిక్కులు తీయాలి. తరువాత తేలికపాటి షాంపూను మాడుకు పట్టించి తలస్నానం చేస్తే కుదుళ్లలో పేరుకున్న మురికి తొలగి శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. తడి జుట్టును గట్టిగా దువ్వుతూ చిక్కులు తీసే ప్రయత్నం చేస్తే శిరోజాలు ఎక్కువగా రాలిపోతాయి.

  • ఒక గిన్నెలో చెంచా చక్కెర, పావు చెంచా తేనె వేసి బాగా కలపాలి. స్నానానికి ముందు ఈ మిశ్రమంతో పెదవులపై మెల్లగా స్క్రబ్‌ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. రక్తప్రసరణ బాగా జరిగి పెదవులు మృదువుగా, ఛాయగా మారతాయి.

  • స్నానానికి అరగంట ముందు ఒక గ్లాసు మంచినీటిని తాగితే ఒంట్లోని వ్యర్ధాలన్నీ బయటికి వెళతాయి. అంతేకాదు శరీరమంతా తేమతో నిండి మృదువుగా ప్రకాశిస్తుంది.

ఇవి కూడా చదవండి..

ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..

మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..

Updated Date - Jun 15 , 2026 | 02:48 AM