మధురామ్లఫలం దానిమ్మ!
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:54 AM
దానిమ్మ లాగా సమస్త పోషకాలూ నిండిన ఫలం మరొకటి కనిపించదు. అనేక రకాల వ్యాధుల నివారణకు ఇది పనిచేస్తుంది....
భోజనకుతూహలం
దానిమ్మ లాగా సమస్త పోషకాలూ నిండిన ఫలం మరొకటి కనిపించదు. అనేక రకాల వ్యాధుల నివారణకు ఇది పనిచేస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచానికి ఆరోగ్య సేవలందిస్తూ వస్తోన్న మహాఫలం దానిమ్మ. దీని ప్రయోజనాలను మన పూర్వీకులు గ్రంథస్తం చేశారు. ఈ విశేషాలలోకి వెళ్తే..
దానిమ్మ చాలా తేలికగా అరిగిపోతుంది. తియ్యతియ్యగా.. పుల్లపుల్లగా.. కొద్దివగరు రుచి కలిగిన దానిమ్మపండు తిన్న తర్వాత కొద్దిగా తీపిగానే అనిపిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని సమస్థితికి తీసుకువస్తుంది.
ఇది వేడి వల్ల కలిగే పొడి దగ్గును తగ్గిస్తుంది. శ్రమ అలసటలను తొలగిస్తుంది.
విరోచనాల సమస్య ఉన్న వారికి దానిమ్మ మంచి మందు. ఈ సమస్య ఉన్నవారు దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల శోష కలగదు. శరీరంలో నీటి శాతం తగ్గిపోదు.
మందులు ఎక్కువగా వాడాల్సి వచ్చినప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వల్ల రకరకాల సమస్యలు ఏర్పడతాయి. వీటన్నింటికీ దానిమ్మ మంచి ఔషధం.
దానిమ్మ గింజలు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. నోరు, నాలుక, గొంతు, పేగులలోని ఆమ్లత్వాన్ని తగ్గించి సమస్థితిని తీసుకువస్తాయి. గుండెల్లో మంట కూడా తగ్గుతుంది. నిద్రపోయిన తర్వాత కొందరికి గొంతులోకి పుల్లని రసం చిమ్మినట్లు అనిపిస్తుంది. ఇలాంటి వారు దానిమ్మ రసం తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
దానిమ్మ గింజలను క్రమం తప్పకుండా తింటే పురుషుల వీర్యంలో జీవకణాల సంఖ్య పెరుగుతుంది.
గంగరాజు అరుణాదేవి
దానిమ్మ గింజలతో పాటుగా పై తొక్కల్లో కూడా అనేక పౌష్టిక విలువలు ఉన్నాయి. ఈ తొక్కలను ఎండబెట్టి దంచి- టీ పొడితో కలిపి టీ కాచుకు తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయి.
దానిమ్మ చెట్టు బెరడును పసుపు కొమ్ములతో కలిపి పొడి చేసి.. దానిని పాలలో కలిపి ఫేస్‌ఫ్యాక్‌గా పెట్టుకుంటే చర్మంపై ఉన్న ముడతలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్