సౌభాగ్య అమావాస్య
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:31 AM
శ్రావణం సకల దేవతలకు ప్రీతికరమైన మాసం. ఈ మాసం సమృద్ధికి ఆలంబనం. ఈ నెలలో ప్రతి రోజూ విశేషమైనదే. ఈ మాసంలో చివరి రోజైన శ్రావణ బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య’...
విశేషం
నేడు పోలాల అమావాస్య
శ్రావణం సకల దేవతలకు ప్రీతికరమైన మాసం. ఈ మాసం సమృద్ధికి ఆలంబనం. ఈ నెలలో ప్రతి రోజూ విశేషమైనదే. ఈ మాసంలో చివరి రోజైన శ్రావణ బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య’ అంటారు. దీన్ని ‘కౌశి అమావాస్య’, ఆలోక అమావాస్య’గా కూడా పూర్వ గ్రంథాలు పేర్కొన్నాయి. ప్రధానంగా ఇది శక్తి పూజ. ముత్తైదువులు దీన్ని ఆచరిస్తారు. పోలాంబకు ప్రతీకగా కందమొక్కను పూజా మండపం మీద ప్రతిష్టించి, పూజిస్తారు. వరి దుబ్బును పూజించే ఆనవాయితీ కూడా ఉంది. తోరాలను కట్టి, వాటిని అమ్మవారికి అర్పించి, తమ చేతులకు, ఇంట్లోని ఆడపిల్లల చేతులకు కట్టుకుంటారు.
పోలాంబను పూజించడం వల్ల కుటుంబ సౌఖ్యం,
సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. నందీశ్వరుడు జన్మించిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పలు ప్రాంతాల్లో రైతులు తమకు సాగులో సాయం చేసే బసవన్నలకు వృషభ పూజను నిర్వహిసారు.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ