Share News

పిత్త దోషం వదలాలంటే

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:16 AM

భౌతిక, మానసిక, భావోద్వేగ లక్షణాల ఆధారంగా పిత్త దోషాన్ని కనిపెట్టవచ్చు. పిత్త అసమతౌల్యంలో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే...

పిత్త దోషం వదలాలంటే

ఆయుర్వేదం

భౌతిక, మానసిక, భావోద్వేగ లక్షణాల ఆధారంగా పిత్త దోషాన్ని కనిపెట్టవచ్చు. పిత్త అసమతౌల్యంలో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే....

మానసిక లక్షణాలు : చికాకు, అసహనం, లేదా కోపం... పిత్త దోష ప్రధాన మానసిక లక్షణాలు. అన్నీ లోపరహితంగా ఉండాలని ఆశించడం, ఎదుటివారిని అంచనా వేసే తత్వం కలిగి ఉండడం, పోటీతత్వం కలిగి ఉండడం, దేన్నైనా సాధించి తీరాలనే మొండి పట్టుదల, సులభంగా కోపానికి లోనవడం మొదలైన గుణాలు కూడా కలిగి ఉంటారు.

భౌతిక లక్షణాలు : చర్మపు దద్దుర్లు, మొటిమలు, ఎగ్జీమా, ఇన్‌ఫ్లమేషన్‌ లాంటి చర్మ లక్షణాలుంటాయి. వీటితో పాటు గ్యాస్ట్రైటిస్‌, లేదా ఆర్థ్రయిటిస్‌, వేడి తట్టుకోలేకపోవడం, చర్మం వేడిగా ఉండడం, యాసిడ్‌ రిఫ్లక్స్‌, అల్సర్లు లేదా డయేరియా లాంటి జీర్ణ సంబంధ సమస్యలు, శరీర దుర్గంధం, అధిక చమట, వెంట్రుకలు ఊడిపోవడం, తీవ్రమైన ఆకలి, దాహం.

ప్రవర్తనా లక్షణాలు : అతిగా పని చేయడం లేదా అతిగా అలసిపోవడం, ఒకటికి మించిన పనులు స్వీకరించడం, అవసరానికి మించి అధికారం చలాయించడం, విమర్శలను స్వీకరించలేకపోవడం.

పర్యావరణ లక్షణాలు : వేడి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, ఎండ, వేడికి సంబంధించిన సమస్యలు, ప్రకాశవంతమైన కాంతిని భరించలేకపోవడం, బిగ్గర శబ్దాలను భరించలేకపోవడం, చల్లని, ప్రశాంతమైన పరిసరాలను ఇష్టపడడం, నీళ్లు, నీడ ప్రాంతాల పట్ల మక్కువ కనబరచడం.

పిత్త దోషం కలిగిన వ్యక్తులు ఇన్‌ఫ్లమేషన్‌, చికాకు మొదలైన లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఎక్కువే! కాబట్టి ఈ సమస్యలను వదిలించుకోవడం కోసం వ్యూహాత్మక మూలికలు, థెరపీల మీద ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే జీవన, ఆహార శైలులను మార్చుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒంట్లో నీటి శాతాన్ని పెంచే పదార్థాలు తీసుకోవాలి. ప్రకృతిలో నడక, యోగాసనాలు కొంత మేరకు తోడ్పడతాయి. ధ్యానం, ప్రాణాయామాలతో పిత్త దోషం సర్దుకుంటుంది. చల్లబరిచే తత్వం కలిగిన కలబంద, కరివేపాకు, పసుపులను తరచూ ఉపయోగిస్తూ ఉండాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 01:16 AM