Share News

పురుగులు పట్టకుండా..

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:48 AM

డబ్బాల్లో నిల్వ చేసిన పప్పులకు పురుగులు పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

పురుగులు పట్టకుండా..

డబ్బాల్లో నిల్వ చేసిన పప్పులకు పురుగులు పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

  • పప్పులు పోసిన డబ్బాల్లో రెండు బిరియానీ ఆకులు ఉంచితే ఎలాంటి పురుగులు చేరవు. పప్పులకు సువాసన కూడా పడుతుంది.

  • ఎండు మిరపకాయల ఘాటు ఉన్నచోటుకి పురుగులు త్వరగా చేరలేవు. పప్పుల డబ్బాల్లో పైపైన కొన్ని ఎండు మిర్చి ముక్కలు వేస్తే చాలు.

  • వేపాకులను బాగా ఎండబెట్టి పప్పుల్లో కలిపితే పురుగులు పట్టవు. అయితే పప్పులను ఉపయోగించుకునేటప్పుడు వేపాకులు లేకుండా చూసుకోవాలి. లేదంటే వండిన పదార్థాలు చేదుగా మారుతాయి.

  • నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను పప్పుల డబ్బాల్లో వేస్తే ఆ ఘాటైన వాసనకు పురుగులు చేరవు.

  • పప్పులకు రెండు చుక్కల ఆవాల నూనె లేదా ఆముదాన్ని పట్టించి డబ్బాల్లో పోసిన ప్రయోజనం ఉంటుంది.

  • పప్పులను డబ్బాల్లో పోసి నిల్వ చేయడానికి ముందు ఒక పూటంతా ఎండలో ఆరబెట్టాలి. దీనివల్ల పప్పుల్లో తేమ ఆరిపోయి పురుగులు పట్టవు.

  • తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివశించేవారు పప్పులను గాలి చొరబడని డబ్బాల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవడం మంచిది. గాజు సీసాలు, స్టీల్‌ డబ్బాల్లో పోసి గట్టిగా మూతలు బిగించి నిల్వ ఉంచినా పప్పులకు పురుగులు పట్టవు.

  • పప్పుల డబ్బాల్లో చిన్న ఉప్పు పొట్లాలు, రెండు లవంగాలు, చిటికెడు పసుపు వేసినా ఫలితం ఉంటుంది.

ఈ వార్తలనూ చదవండి:

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన

యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి

Updated Date - Jun 01 , 2026 | 12:48 AM