Share News

నోటి క్యాన్సర్‌కు చెక్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 02:04 AM

మన దేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో నోటి క్యాన్సర్‌ ఒకటి. నియంత్రించే వీలున్న, ప్రారంభంలోనే గుర్తించి చికిత్సను అందించగలిగే వీలున్న క్యాన్సర్‌ కూడా ఇదే! కాబట్టి...

నోటి క్యాన్సర్‌కు చెక్‌

క్యాన్సర్‌ కేర్‌

మన దేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో నోటి క్యాన్సర్‌ ఒకటి. నియంత్రించే వీలున్న, ప్రారంభంలోనే గుర్తించి చికిత్సను అందించగలిగే వీలున్న క్యాన్సర్‌ కూడా ఇదే! కాబట్టి నోటి క్యాన్సర్‌ గురించి అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం

ప్రపంచం మొత్తంలోని నోటి క్యాన్సర్‌ రోగుల్లో మూడింట ఒక వంతు మంది మన దేశంలోనే ఉన్నారు. ఐసిఎమ్‌ఆర్‌ డాటా ప్రకారం, భారతదేశంలోని పురుషుల్లో కనిపించే అత్యంత సాధారణ క్యాన్సర్లలో నోటి క్యాన్సర్‌ ఒకటి. సిగరెట్‌, బీడీ, గుట్కా, పాన్‌ మసాలా, ఖైనీ, పొగాకు కలిగి ఉండే పాన్‌ ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. కాబట్టి ఈ అలవాట్లున్న ప్రతి వ్యక్తీ నోటి క్యాన్సర్‌ ప్రారంభ లక్షణాలను కనిపెట్టగలిగితే, ఈ వ్యాధికి సులభంగా అడ్డుకట్ట వేయొచ్చు.

ముప్పు వీరికే...

  • పొగతో కూడిన పొగలేని పొగాకును ఉపయోగించే ప్రతి వ్యక్తి

  • పొగాకుతో కలిపి లేదా పొగాకు జోడించకుండా వక్కపొడి, పాన్‌ మసాలాలను ఉపయోగించే ప్రతి వ్యక్తి

  • మద్యంతో కలిపి పొగాకు ఉత్పత్తులను ఉపయోగించే ప్రతి వ్యక్తి

  • ఐదేళ్లకు పైగా ఈ ఉత్పత్తులను ఉపయోగిస్తున్న ప్రతి వ్యక్తి హెచ్చరిక సంకేతాలు

  • నోటి లోపల లేదా నాలుక పైన ఎర్రని మచ్చలు

  • నోరు, దవడ, మెడలో వాపు, గడ్డలు

  • మింగేటప్పుడు ఇబ్బంది, నొప్పి

  • నోరు మొద్దుబారడం లేదా నొప్పి ప్రారంభంలోనే గుర్తిస్తే...

  • మొదటి దశలోనే నోటి క్యాన్సర్‌ను గుర్తిస్తే ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సర్జరీ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది

  • మూడు, నాలుగు దశల్లోని నోటి క్యాన్సర్‌ పెద్ద సర్జరీకి దారి తీస్తుంది. దాంతో దవడ, నాలుక, మెడతో పాటు జీవన నాణ్యత కూడా దెబ్బ తింటుంది పరిష్కారం

  • పొగాకు ఉత్పత్తులు ఉపయోగించేవారు ఆ అలవాటును మానుకోవడం కోసం వైద్యులను కలవాలి

  • నెలకోసారి వెలుగులో నోటిని పరీక్షించుకోవాలి. అవసరమైతే టార్చ్‌ ఉపయోగించాలి

ఈ వార్తలు కూడా చదవండి...

పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు

16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల

Read AP News Latest, Telangana News  And National News

Updated Date - Jun 09 , 2026 | 02:04 AM