Share News

పాత పరుపుతో ప్రమాదమా..?

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:22 AM

బట్టలు లేదా ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌తో పోలిస్తే మనం పరుపులను అంత త్వరగా మార్చము. ఏళ్లతరబడి వాటినే ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇలా చేయడం...

పాత పరుపుతో ప్రమాదమా..?

బట్టలు లేదా ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌తో పోలిస్తే మనం పరుపులను అంత త్వరగా మార్చము. ఏళ్లతరబడి వాటినే ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా పాత పరుపులను వాడితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం...

  • పరుపు ఎంత మంచిదైనప్పటికీ వాడకంలో క్రమంగా దాని సౌకర్యం, సపోర్ట్‌ మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో సరిగా నిద్ర పట్టక ఆరోగ్యం ప్రభావితమవుతుంది.

  • కొన్నేళ్లుగా పరుపును అలాగే వాడుతుంటే దానిలోని మెకానిజం పూర్తిగా పాడవుతుంది. పరుపులో ఉండే ఫోమ్‌ లేదా దూది దగ్గరకు వచ్చేస్తుంది. ఉపరితలం అసమానంగా తయారవుతుంది. కొన్ని రకాల పరుపుల్లో ఉండే స్ర్పింగ్‌లు పటుత్వాన్ని కోల్పోతాయి. దీంతో వెన్నుకు సరైన సపోర్టు లభించక తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. త్వరగా నిద్ర పట్టకపోవడం, తరచూ మెలకువ రావడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

  • పరుపు పాతదవుతున్న కొద్దీ అందులో దుమ్ము, ధూళి, తేమ, చిన్న చిన్న పురుగులు చేరుతుంటాయి. పరుపు కవర్లు వాడినప్పటికీ అంతగా ఫలితం ఉండదు. దీంతో శ్వాసకోశ సమస్యలు, శరీరంపై రకరకాల అలెర్జీలు ఏర్పడుతుంటాయి. విపరీతంగా తుమ్ములు రావడం, మెడనొప్పి లాంటివాటిని కూడా గమనించవచ్చు.

  • పరుపు ఎంత మంచిగా కనిపిస్తున్నప్పటికీ ఏడేళ్లకు మించి దాన్ని వాడకూడదు. పాత పరుపును మార్చి కొత్తది వేసుకున్నప్పుడే హాయిగా నిద్రపడుతుంది. దీంతో ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 05:23 AM