ఆఫీసులో ఇలా...
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:43 AM
ఆఫీసులో పని సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం...
ఆఫీసులో పని సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం...
ఆఫీసుకు రాగానే ఆ రోజు చేయాల్సిన పనులను గుర్తించాలి. వాటిలో ముఖ్యమైనవాటికి ప్రాధాన్యమిస్తూ ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకుని ఆ ప్రకారమే వాటిని పూర్తిచేయాలి.
ఒకేసారి ఎక్కువ పనులు చేయాలనుకోకూడదు. దానివల్ల మెదడు అలసిపోతుంది. కాబట్టి అత్యవసరమైనవాటిని ముందుగా పూర్తిచేసి మిగిలినవాటిని సమయానుసారం విభజించుకోవడం మంచిది. పెద్ద పనులను సైతం భాగాలుగా చేసి ఒక్కోదాన్ని త్వరత్వరగా ముగించే ప్రయత్నం చేయాలి.
తక్కువ సమయంలో అంటే అయిదు నిమిషాల్లోపు చేయదగ్గ పనులను వెంటనే చేసేస్తే ఆఫీసు వర్క్ త్వరగా పూర్తవుతుంది.
ఆఫీసు పని చేసేటప్పుడు అవసరమైతే తప్ప ఫోన్ నోటిఫికేషన్లు చూడకూడదు. వాటివల్ల ఏకాగ్రత దెబ్బతిని పనులు ఆలస్యమవుతుంటాయి.
ఆఫీసు టేబుల్‌ను శుభ్రంగా ఉంచుకుంటూ పొందికగా సర్ది పెట్టుకోవాలి. అప్పుడే పనిచేయాలనే ఆసక్తి కల్గుతుంది.
పని ఒత్తిడి ఉన్నప్పటికీ గంటకోసారి అయిదు నిమిషాల బ్రేక్ తీసుకోవడం మంచిది. దీనివల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. వేగంగా పనులను పూర్తిచేయాలనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్
మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త