Share News

లోపాలు - సంకేతాలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:16 AM

మన చర్మం, పెదవులు, వెంట్రుకలు, నిద్ర మన పోషక లోపాలకు సంకేతాల్లాంటివి. కాబట్టి వాటిలో తలెత్తే అసాధారణ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, సంబంధిత పోషక లోపాన్ని భర్తీ చేసే ప్రయత్నాలు...

లోపాలు - సంకేతాలు

పోషక లోపాలు

మన చర్మం, పెదవులు, వెంట్రుకలు, నిద్ర మన పోషక లోపాలకు సంకేతాల్లాంటివి. కాబట్టి వాటిలో తలెత్తే అసాధారణ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, సంబంధిత పోషక లోపాన్ని భర్తీ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. మన శరీరం ఆరోగ్యకరమైన చర్మం కోసం, కణజాల మరమ్మత్తు కోసం, నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరణ కోసం, రోగ నిరోధక వ్యవస్థ సమర్థమైన పనితీరు కోసం కీలక విటమిన్లు, ఖనిజ లవణాల మీద ఆధారపడుతుంది. కొన్ని పోషకాలు లోపించినప్పుడు, ఆ పరిస్థితి కొన్ని లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటుంది. అవేంటంటే....

నోటి పుండ్లు: మౌత్‌ అల్సర్లు... విటమిన్‌ బి 12, ఫోలేట్‌, ఐరన్‌ లేదా జింక్‌ లోపానికి సంకేతాలు.

పొడి చర్మం: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ ఎ, విటమిన్‌ ఇ లోపాలకు సంకేతాలు.

పెదవుల పగుళ్లు: మరీ ముఖ్యంగా పెదవుల చివర్లలో ఏర్పడే పగుళ్లకు బి విటమిన్లు, ఐరన్‌ లేదా జింక్‌ లోపమే కారణం.

చుండ్రు: అపరిశుభ్రత, ఫంగస్‌ పెరుగుదలతో పాటు జింక్‌, బి విటమిన్లు కూడా చుండ్రుకు కారణమవుతాయి.

రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌: ఐరన్‌ లోపం ఈ సమస్యకు కారణం. కాబట్టి ఫెరిటిన్‌ మోతాదులను సరి చూసుకోవాలి.

తెల్ల జుట్టు: యవ్వనంలోనే జుట్టు తెల్లబడడానికి జన్యువులు కారణం కావచ్చు. అయితే కొందర్లో విటమిన్‌ బి12, ఐరన్‌, కాపర్‌ లోపాలు కూడా కారణం కావచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 02:16 AM