Share News

నైట్‌ షిఫ్ట్‌ చేస్తున్నారా..?

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:57 AM

నైట్‌ షిప్ట్‌లలో పనిచేసేవారు అనారోగ్యం పాలవకుండా పాటించాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం...

నైట్‌ షిఫ్ట్‌ చేస్తున్నారా..?

నైట్‌ షిప్ట్‌లలో పనిచేసేవారు అనారోగ్యం పాలవకుండా పాటించాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం...

  • రోజూ ఒకే సమయానికి పడుకుని నిద్ర లేచేలా ప్లాన్‌ చేసుకోవాలి. దీనివల్ల శరీరంలో జీవక్రియలు మందగించకుండా ఉంటాయి.

  • ప్రోటీన్‌, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకలు, నట్స్‌ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. పోషకాహారానికి ప్రాధాన్యమిస్తే ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదు.

  • రాత్రి సమయంలో నూనె పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ తినకూడదు. వీటివల్ల జీర్ణాశయ సమస్యలు రావచ్చు. తరచూ మంచినీటిని తాగుతూ ఉండాలి.

  • నిద్ర వస్తుందంటూ టీ, కాఫీ ఎక్కువగా తాగకూడదు. వీటివల్ల డీహైడ్రేషన్‌ సమస్యలు రావచ్చు. మితంగా గ్రీన్‌ టీ తీసుకోవచ్చు.

  • మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్‌లు తీసుకోవాలి. ఆ సమయంలో కొద్దిసేపు వాకింగ్‌ చేయడం మంచిది.

  • షిప్ట్‌ వర్క్‌ పూర్తయిన తరువాత ఉదయాన్నే తప్పకుండా వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వీటివల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆపైన గోరువెచ్చటి నీటితో స్నానం చేసి అల్పాహారం తీసుకున్న తరువాత నిద్రకు ఉపక్రమించాలి.

  • పడక గదిలో ఎక్కువగా వెలుతురు లేకుండా సాధ్యమైనంత చీకటిగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల త్వరగా గాఢనిద్రలోకి జారుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 22 , 2026 | 01:57 AM