Share News

మెరిసే పళ్ల కోసం

ABN , Publish Date - May 21 , 2026 | 04:20 AM

పసుపురంగులోకి మారిన దంతాలను తెల్లగా మెరిపించే చిట్కాలివే...

మెరిసే పళ్ల కోసం

పసుపురంగులోకి మారిన దంతాలను తెల్లగా మెరిపించే చిట్కాలివే...

  • టూత్‌బ్ర్‌షకు బదులు వేపపుల్లతో తోముకుంటే దంతాలు పూర్తిగా శుభ్రపడతాయి. పాచి, గార లాంటివి పేరుకోకుండా దంతాలు ఎప్పుడూ తెల్లగా మెరుస్తుంటాయి.

  • చిన్న పళ్లెంలో చెంచా బేకింగ్‌ సోడా వేసి తగినంత నీటిని చిలకరించి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమంతో రెండురోజులకోసారి దంతాలు తోముకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, మంచినీళ్లను సమపాళ్లలో కలిపి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే దంతాలు తెల్లగా మారిపోతాయి.

  • రోజూ రాత్రి పడుకునేముందు చెంచా నువ్వులను నోట్లో పోసుకుని బాగా నమిలి ఉమ్మేయాలి. ఆపైన దంతాలను టూత్‌బ్ర్‌షతో తోముకుని మంచినీటితో పుక్కిలిస్తే దంతాలపై పేరుకున్న పసుపుదనం క్రమంగా తొలగిపోతుంది.

  • తరచూ జామ, యాపిల్‌ పండ్లతోపాటు కేరట్‌, బీట్‌రూట్‌లను దంతాలతో నమిలి తినడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల దంతాలపై మరకలు ఏర్పడవు.

  • తాజా కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెతో రోజుకు పది నిమిషాలపాటు ఆయిల్‌ పుల్లింగ్‌ చేసి ఆపైన గోరువెచ్చటి నీటితో నోటిని శుభ్రం చేసుకున్నా ఫలితం ఉంటుంది.

  • కాఫీ, టీలను ఎక్కువగా తాగకూడదు. పండ్ల రసాలు, కూల్‌డ్రింక్‌లు, రంగుల సోడాలు తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం మంచిది.

ఇవి కూడా చదవండి..

రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..

చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ.

Updated Date - May 21 , 2026 | 04:20 AM