Share News

చెమట వాసన వేధిస్తోందా

ABN , Publish Date - May 13 , 2026 | 04:20 AM

ఎండాకాలంలో ఎక్కువగా చెమట పడుతూ శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. దీన్ని సులువుగా నివారించే చిట్కాలివే...

చెమట వాసన వేధిస్తోందా

ఎండాకాలంలో ఎక్కువగా చెమట పడుతూ శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. దీన్ని సులువుగా నివారించే చిట్కాలివే...

  • చిన్న గిన్నెలో చెంచా బేకింగ్‌ సోడా, అర చెంచా నిమ్మరసం వేసి అవసరమైతే కొన్ని నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని చెమట అధికంగా పట్టే చోట రాసి పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. దీంతో చెమట వాసన, హానికారక బ్యాక్టీరియాలు వెంటనే తొలగిపోతాయి.

  • ఒక బకెట్‌ నీటిలో పావు కప్పు టమాటా రసాన్ని కలపాలి. ఆ నీటితో స్నానం చేస్తే చెమట వాసన తొలగి శరీరం తాజాగా మారుతుంది

  • రెండు చెంచాల ముల్లంగి రసంలో చెంచా గ్లిజరిన్‌ కలిపి శరీరానికి రాసుకుని అర గంట తరువాత స్నానం చేస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

  • కప్పు వేడి నీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన దూది ఉండతో శరీరాన్నంతా రుద్దుకుని ఆపైన గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే చెమట వాసన పూర్తిగా తొలగిపోతుంది.

  • ఒక లీటరు వేడి నీళ్లలో రెండు గ్రీన్‌ టీ బ్యాగ్‌లు వేసి పావు గంటసేపు ఉంచాలి. తరువాత ఆ నీటిని స్ర్పే బాటిల్లో పోసి శరీరంపై స్ర్పే చేసుకుని అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీరం తాజాగా ఉంటుంది.

  • ఒక బకెట్‌ నీటిలో గుప్పెడు రోజ్‌మేరీ ఆకుల రసాన్ని కలిపి పది నిమిషాల తరువాత ఆ నీటితో స్నానం చేస్తే శరీరం సువాసనభరితంగా మారుతుంది.

  • టీ ట్రీ ఆయిల్‌లో దూది ఉండను ముంచి దానితో చెమట ఎక్కువగా పట్టే చోట రుద్దుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. తరువాత పలుచని తువాలుతో శరీరాన్ని తుడుచుకుని కొద్దిగా టాల్కం పౌడర్‌ వేసుకుంటే సమస్య తీరుతుంది.

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 13 , 2026 | 04:20 AM