Share News

ఆవ నూనెతో ఇలా...

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:43 AM

శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరిగేందుకు ఆవనూనె ఎలా తోడ్పడుతుందో చూద్దాం...

ఆవ నూనెతో ఇలా...

శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరిగేందుకు ఆవనూనె ఎలా తోడ్పడుతుందో చూద్దాం...

  • మందపాటి గిన్నెలో నాలుగు చెంచాల ఆవ నూనె, చెంచా మెంతులు వేసి చిన్న మంట మీద వేడిచేయాలి. నూనె రంగు మారిన తరువాత దించి చల్లార్చి సీసాలోకి వడబోసి భద్రపరచుకోవాలి. దీన్ని వారానికి రెండుసార్లు తలకు పట్టించి అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఆవనూనెలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇ విటమిన్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కుదుళ్లను గట్టిపరుస్తాయి. మెంతుల్లోని గుణాలు శిరోజాలను మృదువుగా మారుస్తాయి.

  • గోరువెచ్చటి ఆవనూనెను మాడుకు పట్టించి మర్దన చేస్తే చుండ్రు తగ్గుతుంది. మాడుమీద రక్తప్రసరణ మెరుగై కుదుళ్లకు తేమ అందుతుంది. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

  • ఆవ నూనెను కుదుళ్ల నుంచి పట్టిస్తే శిరోజాల చివర్లు చిట్లవు. మృదువుగా పొడవుగా పెరుగుతాయి. ఆవాల్లోని ఓలిక్‌ యాసిడ్‌ కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది.

  • రెండు చెంచాల ఆవాల నూనెలో చెంచా పెరుగు కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తరువాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేస్తే మాడు మీద చుండ్రు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

  • కప్పు ఆవనూనెలో గుప్పెడు కరివేపాకు, పావు కప్పు ఉసిరి ముక్కలు, రెండు మందార పూలు వేసి బాగా మరిగించి వడబోయాలి. రెండు రోజులకోసారి దీన్ని మాడుక పట్టించి అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి..

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ

కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..

Updated Date - Oct 04 , 2026 | 05:43 AM