తాజా లుక్ కోసం...
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:29 AM
ఉదయాన్నే ముఖం తాజాగా ప్రకాశించేందుకు ఉపకరించే ఇంటి చిట్కాలివే...
ఉదయాన్నే ముఖం తాజాగా ప్రకాశించేందుకు ఉపకరించే ఇంటి చిట్కాలివే...
నిద్ర లేవగానే ముఖంపై చల్లటి నీటిని చిలకరించుకుంటూ క్లెన్సర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జిడ్డు, మృతకణాలు తొలగి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
ముఖాన్ని కడిగేసుకున్న తరువాత మెత్తటి తువాలుతో సున్నితంగా అద్దుకోవాలి. అంతే తప్ప తువాలుతో గట్టిగా రుద్దకూడదు.
చర్మ తత్వానికి సరిపడే సీరమ్ లేదా మాయిశ్చరైజర్‌ను ముఖానికి అప్లయ్ చేసుకోవాలి. తరువాత చేతి వేళ్లతో కింది నుంచి పైకి మెల్లగా మర్దన చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ పెరిగి ముఖంపై ఉబ్బు తగ్గుతుంది. చర్మం తేమతో నిండి మృదువుగా తాజాగా కనిపిస్తుంది.
బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి సన్‌స్ర్కీన్ రాసుకోవాలి. దీనివల్ల ఎండకు చర్మం కమలడం, పిగ్మెంటేషన్ లాంటి సమస్యలు రావు.
ఇవి కూడా చదవండి..
ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..