చినుకుల వేళ.. తప్పనిసరి జాగ్రత్తలు
ABN , Publish Date - Aug 03 , 2026 | 01:22 AM
వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు, రోజువారీ పనుల్లో కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్యాలు, ప్రమాదాల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు...
వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు, రోజువారీ పనుల్లో కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్యాలు, ప్రమాదాల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు.
తడి దుస్తులు వద్దు: వర్షంలో తడిస్తే వెంటనే వాటిని విడిచి పొడి దుస్తులు ధరించాలి. తడిబట్టలతో ఎక్కువసేపు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
పాదాల సంరక్షణ: వర్షపు నీటిలో నడిచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లను సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. వేళ్ల మధ్య తడి లేకుండా పొడి తువాలుతో తుడుచుకోవాలి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు పాదాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
రైన్‌గేర్ సంరక్షణ: గొడుగులు, రెయిన్ కోట్లను వాడిన తర్వాత ఆరబెట్టకుండా అలాగే మడతపెట్టి ఉంచితే బూజు పట్టి దుర్వాసన వస్తాయి. బాగా ఆరిన తర్వాతే వాటిని భద్రపరచాలి.
దుస్తులు.. చెప్పుల ఎంపిక
తేలికపాటి దుస్తులు: త్వరగా ఆరిపోయే కాటన్ లేదా సింథటిక్ దుస్తులు ఎంచుకోవాలి. చాలా లూజ్‌గా, సౌకర్యంగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది.
పాదరక్షలు: వర్షాకాలంలో కాన్వాస్ లేదా లెదర్ చెప్పులు, బూట్లు వాడకపోవడమే మంచిది. నీటిలో నానితే అవి పాడవుతాయి. రబ్బరు లేదా వాటర్ ప్రూఫ్ గ్రిప్ ఉన్న చెప్పులు వాడితే జారిపోకుండా జాగ్రత్త పడవచ్చు.
ప్రయాణాలు.. జాగ్రత్తలు
వాహనాల తనిఖీ: మీ బైక్ లేదా కారు టైర్ల గ్రిప్, బ్రేకులు, వైపర్లు సరిగా ఉన్నాయో, లేదో చూసుకోండి. రోడ్లు జారేలా ఉంటాయి కాబట్టి వేగాన్ని తగ్గించి వాహనం నడపాలి.
మ్యాన్‌హోల్స్: రోడ్లపై నిలిచిన నీటిలో గుంతలు, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్ కనబడవు. తెలియని, లేదా నీరు ఎక్కువగా నిలిచిన రోడ్లపై వాహనాలు నడపకపోవడమే శ్రేయస్కరం.
ఫస్ట్ ఎయిడ్ కిట్: ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్, అత్యవసర మందులు, గొడుగు, వాటర్ బాటిల్ ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.
ముందు జాగ్రత్తే ఉత్తమమైన నివారణ. చిన్నచిన్న విషయాల్లో శ్రద్ధ వహిస్తే ఈ వర్షాకాలంలో వ్యాధులు, ప్రమాదాల బారినపడకుండా ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా గడపవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..