Share News

శిరోజాల సంరక్షణ...

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:37 AM

వర్షాకాలంలో శిరోజాల సంరక్షణ కోసం పాటించాల్సిన చిట్కాలివే...

శిరోజాల సంరక్షణ...

వర్షాకాలంలో శిరోజాల సంరక్షణ కోసం పాటించాల్సిన చిట్కాలివే...

  • గోరువెచ్చటి కొబ్బరి నూనెతో తలంతా మర్దన చేసుకోవాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై కుదుళ్లు బలపడతాయి. పోషణ అంది శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

  • సల్ఫేట్లు, ఇతర రసాయనాలతో కూడిన షాంపూలను ఉపయోగించడంవల్ల శిరోజాలు పొడిబారి బలహీనం కావచ్చు. కాబట్టి తలస్నానం కోసం మందార ఆకులు, కుంకుళ్లు, శీకాయ లాంటి వాటితో పాటు రసాయన రహితమైన షాంపూలు వినియోగించడం శ్రేయస్కరం.

  • వర్షంలో తడిసినప్పుడు తప్పనిసరిగా గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. తరువాత మెత్తటి తువాలుతో శిరోజాలను అద్దుతూ నెమ్మదిగా తల తుడుచుకోవాలి.

  • శిరోజాలు తడిగా ఉన్నప్పుడు చిక్కులు తీయడం, దువ్వడం చేయకూడదు.

  • శిరోజాలను గట్టిగా బిగించి జడ వేసుకోవడం, కొప్పు పెట్టుకోవడం మంచిది కాదు.

  • తల త్వరగా ఆరాలంటూ హెయిర్‌ డ్రైయర్స్‌, శిరోజాల స్టయిలింగ్‌ కోసం స్ట్రయిట్‌నర్స్‌ను ఎక్కువగా వాడకూడదు. హీట్‌ స్టయిలింగ్‌, కర్లింగ్‌ తదితరాలను తగ్గించాలి.

  • కలబంద గుజ్జు, ఉల్లిపాయ రసం, మెంతుల పేస్టు, మెత్తగా రుబ్బిన గోరింటాకు లాంటి వాటిని తరచూ తలకు పట్టించి ప్యాక్‌లా వేస్తే శిరోజాలు సహజ మెరుపుతో నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.

  • ఐరన్‌, బయోటిన్‌, డి విటమిన్‌ ఎక్కువగా లభించే పోషకాహారం తీసుకోవాలి. నట్స్‌, కోడిగుడ్లు, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తింటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది

  • పనుల ఒత్తిడి, ఆందోళనల వల్ల కూడా శిరోజాలు బలహీనమవుతుంటాయి. వీటిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచే యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి. రోజుకు ఎనిమిది గంటలు హాయిగా నిద్రించాలి.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త

Updated Date - Jul 02 , 2026 | 03:37 AM