Share News

విండో కవరింగ్స్‌తో సరికొత్తగా...

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:46 AM

కిటికీల అలంకరణ కోసం బ్లైండ్స్‌, షేడ్స్‌ లాంటి విండో కవరింగ్స్‌ విరివిగా అందుబాటులోకి వచ్చేశాయి. కర్టెన్లకు బదులు వీటిని ఏర్పాటు చేసుకుంటే ఇల్లు రిచ్‌గా కనిపిస్తుంది. ఆ వివరాలు...

విండో కవరింగ్స్‌తో సరికొత్తగా...

కిటికీల అలంకరణ కోసం బ్లైండ్స్‌, షేడ్స్‌ లాంటి విండో కవరింగ్స్‌ విరివిగా అందుబాటులోకి వచ్చేశాయి. కర్టెన్లకు బదులు వీటిని ఏర్పాటు చేసుకుంటే ఇల్లు రిచ్‌గా కనిపిస్తుంది. ఆ వివరాలు...

హనీకోంబ్‌ షేడ్స్‌

వీటి డిజైన్‌ తేనెపట్టు మాదిరి అరలు అరలుగా కనిపిస్తుంది. ఈ అరలు.. వేసవిలో బయటి వేడి లోపలికి రాకుండా చూస్తాయి. అలాగే శీతాకాంలో గది ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ప్రత్యేకమైన ఈ అమరికవల్ల బయటి వాహనాల శబ్దాలు ఇంట్లోకి వినిపించవు. దీంతో ఇల్లంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. గదిని చీకటిగా మార్చే బ్లాక్‌ అవుట్‌, కొద్దిగా వెలుతురునిచ్చే లైట్‌ ఫిల్టరింగ్‌ రకాలతోపాటు సింగిల్‌ సెల్‌, డబుల్‌ సెల్‌ మోడల్స్‌ లభ్యమవుతున్నాయి. సన్నటి కిటికీ ఫ్రేమ్‌లో కూడా ఇవి చక్కగా అమరి గదిని విశాలంగా మార్చేస్తాయి.

వర్టికల్‌ బ్లైండ్స్‌

వీటిని పొడవాటి పట్టీలతో రూపొందిస్తారు. ఇవి స్లైడింగ్‌ డోర్స్‌ ఉన్న పెద్ద కిటికీలకు చక్కగా సూటవుతాయి. వీటిమీద దుమ్ము నిలవదు. ఆర్నెల్లకోసారి స్పాంజ్‌తో తుడిచేస్తే సరిపోతుంది. ఏదైనా పట్టీ పాడైతే ఆ ఒక్కదాన్ని మార్చుకునే వీలుంటుంది. ఫ్యాబ్రిక్‌, పీవీసీ రకాలు విరివిగా లభ్యమవుతున్నాయి.

ప్లాంటేషన్‌ షట్టర్స్‌

వీటిలో వెడల్పాటి అడ్డ పలకలు ఉంటాయి. వీటిని సులువుగా మూయవచ్చు తెరవవచ్చు. గాలి, వెలుతురు, ప్రైవసీలకు అనుగుణంగా పలకల కోణాన్ని చేత్తో మార్చుకోవచ్చు. హాల్‌, లివింగ్‌ రూమ్‌, డైనింగ్‌ రూమ్‌, బెడ్‌ రూమ్‌ కిటికీలకు వీటిని అమరిస్తే ఇల్లు క్లాసీగా కనిపిస్తుంది. పీవీసీ, ఫాక్స్‌ వుడ్‌, కాంపోజిట్‌ మెటీరియల్‌ మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి దశాబ్దాల పాటు చెక్కు చెదరవు.


ప్యానెల్‌ ట్రాక్‌ బ్లైండ్స్‌

వీటిలో పొడవుగా ఉండే వెడల్పాటి ప్యానెల్స్‌ ఉంటాయి. ట్రాక్‌ సిస్టమ్‌ ద్వారా థ్రెడ్‌ సహాయంతో ప్యానెల్స్‌ను పైకి కిందికి లేదా పక్కలకు జరుపుకోవచ్చు. రకరకాల ఫ్యాబ్రిక్‌లు, మెటీరియల్స్‌తో ఈ ప్యానెల్స్‌ను రూపొందిస్తున్నారు. సన్‌స్ర్కీన్‌, లైట్‌ ఫిల్టరింగ్‌, బ్లాక్‌అవుట్‌ రకాలు లభ్యమవుతున్నాయి. మినిమలిస్టిక్‌ ఇంటీరియర్స్‌ను ఇష్టపడేవారికి ఇవి మంచి ఎంపిక.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 05:46 AM