పిల్లల మాటలకు అడ్డుపడే ఫోన్లు
ABN , Publish Date - Mar 10 , 2026 | 02:31 AM
పిల్లలు పేచీ పెట్టకుండా తినడానికీ, మారాం చేయకుండా ఉండడానికీ తల్లితండ్రులు వాడుతున్న మంత్రదండం... సెల్‌ఫోన్. సెల్‌పోన్ల వాడకం పిల్లల...
అప్రమత్తం
పిల్లలు పేచీ పెట్టకుండా తినడానికీ, మారాం చేయకుండా ఉండడానికీ తల్లితండ్రులు వాడుతున్న మంత్రదండం... సెల్‌ఫోన్. సెల్‌పోన్ల వాడకం పిల్లల స్పీచ్ డిలేకు కారణమవుతోంది. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతున్నాయి. తాజా పరిశోధనలో వెల్లడైన వాస్తవాలు ఏవంటే...
రోజుకు అరగంట ఫోన్ వాడకంతో పిల్లల్లో మాటలు మాట్లాడలేని ముప్పు రెట్టింపుగా ఉంటుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెండేళ్ల లోపు పిల్లలు రోజుకు అరగంట పాటు సెల్‌ఫోన్‌కు బహిర్గతమవడం మూలంగా వాళ్లలో మాటలు రాని సమస్య 49ు మేరకు పెరిగే ప్రమాదం ఉంటుంది. భాష మెరుగు పడడంలో సంభాషణ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ సెల్‌ఫోన్‌కు అంటుకుపోయే పిల్లలు మాట్లాడే అవకాశాలు తగ్గిపోవడంతో, వీరిలో సంభాషణ పట్ల ఆసక్తి, భాష పట్ల పట్టు తరిగిపోతుంది. సమాచార మార్పిడి జరిగినప్పుడే పిల్లలో కొత్త ఆలోచనలు, నాడీ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఈ మార్పిడి కొరవడినప్పుడు మూడేళ్ల వయసు దాటుతున్నా మాటలు మాట్లాడలేని పరిస్థితి తలెత్తుతుంది. ఈ సమస్యకు తోడు, మెదడులో వైట్ మ్యాటర్ వృద్ధి నెమ్మదించి, తెలివితేటలు తగ్గుతాయి. పిల్లల మెదడు ఎదుగుదలకు తొలి రెండేళ్లు ఎంతో కీలకమైనవి. కాబట్టి ఈ రెండేళ్లలో పిల్లలను సెల్‌ఫోన్లకు పూర్తిగా దూరం పెట్టాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్‌కు చెందిన పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంతకంటే పెద్ద పిల్లలకు కూడా సెల్‌ఫోన్లకు బదులుగా పుస్తకాలు చదవడం, ఆటల్లో చురుగ్గా పాల్గొనడం లాంటి అలవాట్లను నేర్పాలనీ, మరీ ముఖ్యంగా పిల్లలతో తల్లితండ్రులు ఎక్కువగా సంభాషిస్తూ ఉండడం మంచిదనీ పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్