Share News

మినిమలిస్ట్‌ ఆర్గనైజింగ్‌

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:34 AM

ఇల్లు ఎంత పెద్దదైనా సరే, వస్తువులు పేరుకుపోయి చెత్తలా కనిపిస్తుంటే మనసులో ఒత్తిడి పెరుగుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు హోమ్‌ డెకర్‌లో పాతకాలపు...

మినిమలిస్ట్‌ ఆర్గనైజింగ్‌

ఇంటీరియర్‌

ఇల్లు ఎంత పెద్దదైనా సరే, వస్తువులు పేరుకుపోయి చెత్తలా కనిపిస్తుంటే మనసులో ఒత్తిడి పెరుగుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు హోమ్‌ డెకర్‌లో పాతకాలపు భారీ ఫర్నిచర్‌, షోకేస్‌ నిండా బొమ్మలు అమర్చే పద్ధతులకు కాలం చెల్లింది. దానికి బదులుగా ఆధునిక మహిళలు ‘మినిమలిస్ట్‌ ఆర్గనైజింగ్‌’ వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ వస్తువులతోనే ఇల్లు అద్భుతంగా, ప్రశాంతంగా కనిపించేలా చేయడానికి ఈ చిన్న స్మార్ట్‌ మార్పులు చేస్తే సరిపోతుంది!

క్లియర్‌ కౌంటర్‌ టాప్‌ రూల్‌: కిచెన్‌ లేదా హాల్‌లోని ప్లాట్‌ఫామ్‌లపై అనవసరపు వస్తువులు లేకుండా చూడాలి. రోజూ వాడని మిక్సీలు, ఓవెన్లు లేదా చిన్న డిజైనర్‌ పీసులను కప్‌బోర్డులలో దాచి, కౌంటర్‌ టాప్‌ను ఖాళీగా ఉంచితే ఇల్లు తక్షణమే విశాలంగా, శుభ్రంగా కనిపిస్తుంది.

యాక్రిలిక్‌ జ్యూట్‌ ఆర్గనైజర్లు: అల్మారాల్లో బట్టలు, మేకప్‌ సామాన్లు ఒకదానిపై ఒకటి పడేయకుండా ట్రాన్స్‌పరెంట్‌ యాక్రిలిక్‌ బాక్సులు లేదా జ్యూట్‌ (జనపనార) బుట్టలను వాడాలి. ఇవి వస్తువులను వెతకడం సులభతరం చేయడమే కాకుండా, వార్డ్‌రోబ్‌కు మోడరన్‌ హోటల్‌ లుక్‌నిస్తాయి.

వర్టికల్‌ ప్లాంటేషన్‌: హాల్‌లోని మూలల్లో అనవసరపు ఫర్నిచర్‌ కాకుండా ఇండోర్‌ మొక్కలతో వర్టికల్‌ స్పేస్‌ క్రియేట్‌ చేయాలి. అలాగే ట్యూబ్‌లైట్ల వెలుతురు కంటే సాఫ్ట్‌ వార్మ్‌లైటింగ్‌ వాడటం వల్ల ఇల్లు పీస్‌ఫుల్‌ వైబ్‌తో మెరిసిపోతుంది.

ఇంటిని డెకరేట్‌ చేయడం అంటే ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి వస్తువులు కొనడం కాదు, అనవసరమైన వస్తువులను తీసేసి స్పేస్‌ను సద్వినియోగం చేసుకోవడమే అసలైన హోమ్‌ మ్యాజిక్‌!

వన్స్‌ ఇన్‌.. వన్స్‌ అవుట్‌ రూల్‌: ఇంట్లోకి ఒక కొత్త వస్తువు కొనుగోలు చేసి తెచ్చినప్పుడు, దానికి బదులుగా పాతబడిన లేదా వాడని ఒక వస్తువును ఇంట్లోంచి బయటకు పంపించేయాలి. దీనివల్ల వస్తువుల సంఖ్య పెరగకుండా ఇల్లు ఎప్పుడూ ఒకే పరిమితిలో క్లటర్‌ ఫ్రీగా ఉంటుంది.

హిడెన్‌ స్టోరేజ్‌ ఫర్నిచర్‌: సామాన్లు బయటకు కనిపించకుండా ఉండటానికి బాటమ్‌ స్టోరేజీ ఉండే సోఫాలు, బెడ్‌లు లేదా ఒట్టోమాన్‌ స్టూల్స్‌ను ఎంచుకోవాలి. బయటకు చాలా సింపుల్‌గా కనిపిస్తూనే, లోపల ఎక్కువ వస్తువులను దాచుకునేందుకు ఇవి అద్భుతంగా తోడ్పడతాయి.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 05:34 AM