తృణధాన్యాలు తగు మాత్రంగా...
ABN , Publish Date - Jun 09 , 2026 | 02:01 AM
తృణధాన్యాలు ఆరోగ్యకరమే! కానీ ప్రతి తృణధాన్యం మనకు తగినది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలకు కొన్ని తృణధాన్యాలు ఆరోగ్యకరం కాదు. ఎందుకో తెలుసుకుందాం!...
ఆహారం- ఆరోగ్యం
తృణధాన్యాలు ఆరోగ్యకరమే! కానీ ప్రతి తృణధాన్యం మనకు తగినది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలకు కొన్ని తృణధాన్యాలు ఆరోగ్యకరం కాదు. ఎందుకో తెలుసుకుందాం!
కొర్రలు
బరువు తగ్గడానికీ, మధుమేహ అదుపుకూ, అత్యధిక కఫానికీ ప్రయోజనకరమైన కొర్రలను హైపోథైరాయిడిజం ఉన్న వాళ్లు పరిమితంగా తీసుకోవాలి
సజ్జలు
వాత తత్వం ఉన్నవాళ్లకూ, కీళ్లనొప్పులు, బలహీనత వేధించేవాళ్లకూ కొర్రలు మంచిది. కానీ అసిడిటీ, నోటి పుండ్లతో, పిత్త అసమతౌల్యంతో బాధపడే వాళ్లు సజ్జలను పరిమితంగానే తీసుకోవాలి
సామలు
రక్తంలో చక్కెర మోతాదులను అదుపులో ఉంచుకోవాలనుకునేవాళ్లు సామలు తినొచ్చు. కానీ తీవ్రమైన కడుపుబ్బరం, అజీర్తి, ఐబిఎస్, జీర్ణ సమస్యలు కలిగిన వారు సామలను వీలైనంత పరిమితం చేయాలి
అరికెలు
మధుమేహం, అధిక బరువు సమస్యలున్నవారు అరికెలు తినొచ్చు. అయితే మలబద్ధకం, అజీర్తి సమస్యలున్నవాళ్లు వీటిని పరిమితంగానే తీసుకోవాలి
ఊదలు
మధుమేహం, బరువు తగ్గడం కోసం ఉపవాసాలు ఉండేవారికి ఊదలు ప్రయోజనకరం. కానీ బరువు తక్కువ ఉన్నవాళ్లు, వాత సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లు ఊదలను పరిమితంగానే తినాలి
జొన్నలు
గ్లూటెన్ లేని జొన్నలు బరువు తగ్గాలనుకునేవారికి మెరుగైన ఆహారం. గుండెకు కూడా ఇవి మేలు చేస్తాయి. అయితే బరువు తక్కువ ఉన్నవాళ్లు, వాత సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లు జొన్నలకు దూరంగా ఉండాలి
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest, Telangana News And National News