Share News

చూయింగ్‌ గమ్‌లో ప్లాస్టిక్‌

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:26 AM

చూయింగ్‌ గమ్‌ నమిలే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అయితే యుసిఎల్‌ఎ పరిశోధకులు చేపట్టిన ఒక పరిశోధనలో...

చూయింగ్‌ గమ్‌లో ప్లాస్టిక్‌

పరిశోధన

చూయింగ్‌ గమ్‌ నమిలే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అయితే యుసిఎల్‌ఎ పరిశోధకులు చేపట్టిన ఒక పరిశోధనలో చూయింగ్‌గమ్‌లో మైక్రోప్లాస్టిక్స్‌ ఉంటున్నట్టు తేలింది. మరిన్ని వివరాలు...

ఈ పరిశోధనలో చూయింగ్‌ గమ్‌ గురించిన ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకొచ్చింది. గమ్‌ను నమిలే సమయంలో చోటు చేసుకునే యాంత్రిక చర్య వల్ల పాలీఎథిలీన్‌, పాలీస్టైరీన్‌తో సహా వందలకొద్దీ మైక్రోప్లాస్టిక్‌ పరమాణువులు లాలాజలంలోకి విడుదల అవుతాయి. కొన్ని రకాల చూయింగ్‌ గమ్‌లను నమిలినప్పుడు మూడు వేల మైక్రోప్లాస్టిక్‌ ముక్కలు లాలాజలంలో విడుదల అవుతున్నట్టు పరిశోధనలో తేలింది. చూయింగ్‌ గమ్‌ జీర్ణరసాలకు ప్రభావితం కాదు. కాబట్టి దీన్లోని మైక్రోప్లాస్టిక్స్‌ నేరుగా రక్తంలో కలుస్తూ ఉంటాయి. చూయింగ్‌ గమ్స్‌లోని మైక్రోప్లాస్టిక్స్‌ దీర్ఘకాలిక ప్రభావాల గురించి మరిన్ని పరిశోధనలు జరగవలసిన అవసరం ఉన్నప్పటికీ, మైక్రోప్లాస్టిక్‌ ముప్పు నుంచి తప్పించుకోవడం కోసం చూయింగ్‌ గమ్‌ నమిలే అలవాటుకు స్వస్థి చెప్పడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ అలవాటును పరిమితం చేయాలనుకునేవారు నమిలే చూయింగ్‌ గమ్‌ల సంఖ్యను తగ్గించుకుని, ఒకే గమ్‌ను ఎక్కువసేపు నమలడం మంచిదని కూడా సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 02:26 AM