Share News

పాత జ్ఞాపకాల మైక్రో అప్‌సైక్లింగ్‌

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:39 AM

పాత జ్ఞాపకాలను పారేయకుండా అత్యంత విలాసవంతమైన ఆర్ట్‌పీస్‌లుగా మార్చే సృజనాత్మక కళ ఇది...

పాత జ్ఞాపకాల మైక్రో అప్‌సైక్లింగ్‌

పాత జ్ఞాపకాలను పారేయకుండా అత్యంత విలాసవంతమైన ఆర్ట్‌పీస్‌లుగా మార్చే సృజనాత్మక కళ ఇది.

ఇంట్లో పాతబడిపోయిన వస్తువులను లేదా వాడని సామగ్రిని పారేయడం సహజం. కానీ ఆ పాత వస్తువులకే కొత్త రూపమిచ్చి, రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి ఒక యూనిక్‌, క్లాసీ లుక్‌ తేవడమే ‘మైక్రోఅప్‌సైక్లింగ్‌ కాన్సెప్ట్‌’ సాధారణ రీసైక్లింగ్‌ లా కాకుండా, దీనిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మన ఇంట్లో మనకు బాగా నచ్చిన పాత జ్ఞాపకాలను డెకర్‌ ఐటెమ్స్‌ మార్చుకోవడం దీని ప్రత్యేకత.

ఉదాహరణకు ఇంట్లో వాడి పక్కన పడేసిన గాజు సీసాలు లేదా లిక్విడ్‌ బాటిళ్లపై ఎయిర్‌ డ్రై క్లే వాడి చిన్న చిన్న డిజైన్లు చేసి, ఆ తర్వాత ఆకట్టుకునే రంగులు వేస్తే అవి మార్కెట్‌లో వేల రూపాయలు ఉండే వింటేజ్‌ డిజైనర్‌ ఫ్లవర్‌ వాజ్‌లుగా మారిపోతాయి. అలాగే పాతబడిపోయిన కాటన్‌ లేదా పట్టు చీరలను పారేయకుండా వాటితో రిచ్‌లుక్‌ ఇచ్చే డోర్‌ కర్టెన్లు, లివింగ్‌ రూమ్‌ కుషన్‌ కవర్లు, లేదా డైనింగ్‌ టేబుల్‌ రన్నర్లుగా మార్చుకోవచ్చు.

అలాగే వంటింట్లో వాడకుండా మిగిలిపోయిన సిరామిక్‌ కప్పులు, కప్‌ సాసర్లను గోడపై వినూత్నంగా ఫిక్స్‌ చేసి చిన్న చిన్న ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచే ‘ప్లాంటర్స్‌’గా మార్చవచ్చు. పాత చెక్క బాక్సులు లేదా వేస్ట్‌ ప్లాస్టిక్‌ డబ్బాలకు జనపనార (జూట్‌) తాడును చుట్టి, ముచ్చటైన బొమ్మలతో అలంకరిస్తే అవి లివింగ్‌ రూమ్‌లో కూర్చునే స్టూల్స్‌గా లేదా స్టోరేజ్‌ బాక్స్‌లుగా ఉపయోగపడతాయి.

ఈ విధానం వల్ల మూడు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది బడ్జెట్‌ ఆదా కావడం, రెండోది పర్యావరణానికి మేలు జరగడం, మూడోది మన సొంత చేతులతో తయారు చేసిన వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల లభించే ఆనందం, ఆత్మీయత. పాత డెకర్‌ స్టైల్స్‌తో విసిగిపోయిన గృహిణులకు ఈ మైక్రోఅప్‌సైక్లింగ్‌ ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం

Updated Date - Nov 02 , 2026 | 01:39 AM