Share News

జ్ఞాపకశక్తి కోసం...

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:30 AM

పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

జ్ఞాపకశక్తి కోసం...

పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

  • మెదడు చురుకుగా పనిచేయాలంటే చక్కని నిద్ర అత్యవసరం. పిల్లలు రోజూ కనీసం తొమ్మిది గంటలు ప్రశాంతంగా నిద్రించేలా చూడాలి.

  • అన్ని రకాల విటమిన్లు, మినరల్స్‌తో కూడిన పోషకాహారాన్ని పిల్లలకు తినిపించాలి. రోజూ పాలు, పండ్లు, బాదం పప్పులను ఆహారంలో చేరిస్తే పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది

  • రోజూ పిల్లలచేత పాఠాలు చదివించాలి. దీనివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. పాఠాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. పాత పాఠాలను రివిజన్‌ చేయించడం మంచి ఫలితాన్నిస్తుంది.

  • చదివిన అంశాలను క్లుప్తంగా చిన్న పాయింట్ల మాదిరి రాయడాన్ని పిల్లలకు నేర్పించాలి. చదువుతూ రాస్తుండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

  • గంటలతరబడి చదవడం వల్ల పిల్లలు అలసిపోతారు. అప్పుడు ఏకాగ్రత తగ్గి చదివిన అంశాలు గుర్తుండకపోవచ్చు. కాబట్టి కనీసం గంటకోసారి పది నిమిషాల విరామాన్ని తీసుకోవడం పిల్లలకు అలవాటు చేయాలి.

  • సెలవు రోజుల్లో పిల్లలతో కలిసి పజిల్స్‌ పూరించడం, చదరంగం లేదా మెమరీ గేమ్స్‌ ఆడడం లాంటివి చేస్తుండాలి. వీటివల్ల పిల్లల్లో ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడతాయి. వేగంగా స్పందించడం, ప్రతి అంశాన్ని సవివరంగా గుర్తుపెట్టుకోవడం అలవాటవుతాయి.

  • రాత్రి పడుకునేముందు చిన్నచిన్న కథలు చెబుతుంటే పిల్లలు వాటిని ఆసక్తిగా వినడమే కాదు పలుమార్లు మననం చేసుకుంటూ ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు. వారిలో ఊహాశక్తి, సృజనాత్మకత కూడా పెరుగుతాయి.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 05:30 AM