రంగు మారుతున్నాయా...
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:56 AM
ఇంట్లో నేలమీద అందంగా మెరిసే మార్బుల్స్, టైల్స్ రంగులు మారకుండా ఎప్పటికీ కొత్తగా కనిపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
ఇంట్లో నేలమీద అందంగా మెరిసే మార్బుల్స్, టైల్స్ రంగులు మారకుండా ఎప్పటికీ కొత్తగా కనిపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
సాధారణంగా ఇంట్లో నేలను తుడిచే నీటిలో వెనిగర్, నిమ్మరసం లాంటివి కలుపుతుంటారు. వీటిలోని ఆమ్ల గుణాలు.. టైల్స్ లేదా మార్బుల్స్ పై పొరను పాడు చేస్తాయి. దీంతో వాటి రంగు మారి మెరుపు, నునుపుదనం మాయమవుతాయి. అలాకాకుండా టైల్స్, మార్బుల్స్ కోసం ప్రత్యేకించిన క్లీనర్లను ఉపయోగిస్తే అవి ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తాయి.
నేలను తుడవడానికి ఉపయోగించే మాప్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో ఉపయోగించినదాన్ని ఇతర గదుల్లో వాడకూడదు. అలాచేస్తే కిచెన్‌లోని జిడ్డు, పసుపు, కారం తదితర మరకలన్నీ మిగిలిన టైల్స్‌కి అంటుకుంటాయి. బాల్కనీ, బాత్‌రూమ్‌లకోసం కూడా వేర్వేరు మాప్‌లను వాడడం మంచిది.
టైల్స్, మార్బుల్స్‌పై ఉండే చిన్న రంధ్రాల్లోకి దుమ్ము, నీరు తదితరాలు చేరి వాటి సహజత్వాన్ని పోగొడతాయి. కాబట్టి వాటిపై మంచి నాణ్యత గల పెనెట్రేటింగ్ సీలర్‌ను వేయిస్తే ఎంతకాలమైనా అవి మెరుస్తూనే ఉంటాయి.
నేలపై నీరు, నూనె, ఆహారపదార్థాలు పడినప్పుడు వెంటనే వాటిని తొలగించి శుభ్రం చేయాలి. లేదంటే వాటి వల్ల ఏర్పడిన పసుపు, గోధుమ రంగుల మరకలు అంత త్వరగా పోవు.
ఇవి కూడా చదవండి:
టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!
అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు