మాన్యువల్ కారుతో మెదడు ఆరోగ్యం
ABN , Publish Date - Jul 21 , 2026 | 01:52 AM
సుఖమైన ప్రయాణం కోసం ఆటొమ్యాటిక్ కారును ఎంచుకునే వాళ్లు ఎక్కువ. అయితే మాన్యువల్ కారు వాడకంతో మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని...
మీకు తెలుసా?
సుఖమైన ప్రయాణం కోసం ఆటొమ్యాటిక్ కారును ఎంచుకునే వాళ్లు ఎక్కువ. అయితే మాన్యువల్ కారు వాడకంతో మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని మీకు తెలుసా?
మాన్యువల్ కారును నడిపే సమయంలో మెదడు ముందు భాగమైన ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ ప్రేరేపితమవుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు ఈ భాగంతో ముడిపడి ఉంటాయి. కారు నడిపేటప్పుడు, మన మెదడు.. క్లచ్ నొక్కే కాలు, గేర్లు మార్చే చేయి, ట్రాఫిక్ వేగాన్ని గమనించే కళ్ల మీద ఏకకాలంలో దృష్టి పెడుతుంది. ఈ భిన్నమైన పనులన్నిటినీ సమన్వయపరుచుకోవడం కోసం కారు నడిపే వ్యక్తి అనుక్షణం అప్రమత్తంగా, చురుగ్గా నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రమాదాలకు అవకాశాలు తగ్గుతాయి. మెదడు చురుకుదనం కూడా పెరుగుతుంది
ప్రతి రోజూ మాన్యువల్ కారు నడిపే వాళ్లలో మెదడు నిరంతరం భిన్నమైన అవయవాల పనితీరును పర్యవేక్షిస్తూ వ్యాయామాన్ని పొందుతుంది. ఆటొమ్యాటిక్ కార్లను నడిపే సమయంలో ఈ వ్యాయామం లోపిస్తుంది
మాన్యువల్ కారు నడిపే సమయంలో నాడీ మార్గాలు ప్రేరేపితమవుతూ కాగ్నిటివ్ ఫంక్షన్ చెక్కుచెదరకుండా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్
మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్..