Share News

మామిడి టెంకెలతో...

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:54 PM

మామిడి టెంకెలను పారేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...

మామిడి టెంకెలతో...

మామిడి టెంకెలను పారేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...

  • మామిడి టెంకెల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తాయి. మామిడి టెంకెలను బాగా ఎండబెట్టి పొడిలా చేసి మట్టిలో కలిపితే మొక్కల వేర్లు బలంగా నాటుకుంటాయి. పూలు, కాయలు కూడా ఎక్కువగా కాస్తాయి.

  • మామిడి టెంకెలను చిన్న ముక్కలుగా చేసి సేంద్రీయ ఎరువుతో కలిపి అందిస్తే మొక్కలు ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతాయి. కుండీల్లో మట్టిని నింపే ముందు మామిడి టెంకెలను పరిస్తే అడుగు భాగంలో ఉండే రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. దీనివల్ల కుండీల్లో నీరు నిలవకుండా సులువుగా బయటికి ప్రవహిస్తుంది. కొన్ని రోజుల తరువాత ఈ టెంకెలు ఎరువుగా మారి వేర్ల ద్వారా మొక్కలకు పోషకాలను అందిస్తాయి.

  • మొక్కల చుట్టూ మామిడి టెంకెలను పరిస్తే నేరుగా ఎండ తగలక మట్టి ఎక్కువసేపు తేమగా ఉంటుంది. దీంతో మొక్కలు వాడిపోకుండా ఉంటాయి. కుండీల్లో మొక్కలు పెంచుకునేవారికి ఈ చిట్కా ప్రయోజనకరంగా ఉంటుంది.

  • మామిడి టెంకెపై ఉండే మందపాటి పొరను జాగ్రత్తగా కత్తిరించి లోపలి గింజను తీసి నీళ్లతో తడిపిన టిష్యూ పేపర్‌లో చుట్టి ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో పెడితే... కొన్ని రోజుల తరువాత దానికి వేర్లు వస్తాయి. దాన్ని మట్టిలో నాటితే మామిడి మొక్క బలంగా పెరుగుతుంది. లేదంటే కావాల్సిన వారికి ఇవ్వవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 05 , 2026 | 11:54 PM