Share News

40ల్లో 20ల్లా

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:46 AM

40 ఏళ్ల వయసులో చర్మం బిగుతు కోల్పోయి, ముడతలు పడడం సహజం. ఈ వయసులో వేసుకునే మేకప్‌ ఆ ముడతలను పెంచేలా ఉండకుండా, చర్మంలో కలిసిపోయిన భ్రమను ...

40ల్లో 20ల్లా

మేకప్‌

40 ఏళ్ల వయసులో చర్మం బిగుతు కోల్పోయి, ముడతలు పడడం సహజం. ఈ వయసులో వేసుకునే మేకప్‌ ఆ ముడతలను పెంచేలా ఉండకుండా, చర్మంలో కలిసిపోయిన భ్రమను కలిగించాలి. అందుకోసం ఇవిగో ఈ చిట్కాలు పాటించాలి

చర్మం సిద్ధం: మొదట ముఖానికి హైడ్రేటింగ్‌ సీరమ్‌/క్రీమ్‌, మాయిశ్చరైజింగ్‌ ప్రైమర్‌ అప్లై చేసుకోవాలి. దాంతో చర్మం మీద కనిపించే సన్నని గీతలు చర్మంలో కలిసిపోతాయి

లైట్‌ వెయిట్‌ కవరేజ్‌: మాట్‌ ఫార్ములాలను కలిగి ఉండే ఫౌండేషన్లకు బదులుగా, హైడ్రేషన్‌ను అందించే షీర్‌ ఫౌండేషన్‌, టింటెడ్‌ మాయిశ్చరైజర్‌ లేదా సిసి క్రీమ్‌ అప్లై చేసుకుంటే ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. అయితే వీటిని వీలైనంత తక్కువ మోతాదులోనే వాడుకోవాలి

కన్‌సీల్‌: కలర్‌ కరెక్టర్‌కు ముందు కన్‌సీలర్‌ వాడుకోవాలి. కళ్ల కింద నల్లని వలయాల కోసం పీచ్‌/నారింజ రంగు కన్‌సీలర్‌ ఎంచుకోవాలి

పౌడర్‌: ముడతలు పడే వీలున్న ప్రదేశాల్లో ట్రాన్స్‌క్యులెంట్‌ పౌడర్‌ పలుచగా అద్దుకోవాలి

బ్లష్‌: చెక్కిళ్ల పైన క్రీమ్‌ బ్లష్‌ అప్లై చేసుకోవాలి

ఐబ్రో పెన్సిల్‌: పలుచగా ఉన్న కనుబొమలను దిద్దుకోవడం కోసం పెన్సిల్‌ ఉపయోగించవచ్చు. కానీ తీర్చిదిద్దినట్టు కాకుండా, సహజసిద్ధంగా ఉండేలా దిద్దుకోవాలి

ఐలైనర్‌: ద్రవరూప ఐలైనర్‌కు బదులుగా,పెన్సిల్‌ లైనర్‌ను ఎంచుకోవాలి

మస్కారా: నాణ్యమైన మస్కారా వాడుకోవాలి. చెదిరిపోకుండా ఉండడం కోసం ట్యూబింగ్‌ ఫార్ములాను కలిగిన మస్కారా ఎంచుకోవాలి

ఐషాడో: క్రీమ్‌ షాడోస్‌ బాగుంటాయి. చక్కగా కలిసిపోతాయి. కాబట్టి ముదురు రంగులకు బదులుగా తేలిక రంగు ఐషాడో ఎంచుకోవాలి.

లిప్‌స్టిక్‌: క్రీమీ లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలి. వేసుకున్న లిప్‌స్టిక్‌ చెదిరిపోకుండా ఉండడం కోసం సాఫ్ట్‌ లైనర్‌ను వాడుకోవాలి

టెక్స్‌చర్‌: మేకప్‌ కోసం ఎంచుకునే సాధనాలు పౌడర్‌ రూపంలో ఉండకుండా చూసుకోవాలి. బదులుగా హైడ్రేషన్‌ను అందించే క్రీమీ ఉత్పత్తులు ఎంచుకోవాలి

బ్లెండ్‌: మేకప్‌ ఎబ్బెట్టుగా కనిపించకుండా చర్మంలో కలిసిపోయిన లుక్‌ పొందడం కోసం, ఫౌండేషన్‌ అద్దుకోడానికి తడిపి పిండిన స్పాంజ్‌ను వాడుకోవాలి

ముడతలు: ముడతలను మేక్‌పతో పూర్తిగా దాచే ప్రయత్నం చేయకూడదు. వీలైనంత సహజసిద్ధమైన లుక్‌ కోసం ప్రయత్నించాలి

ఇవి కూడా చదవండి:

వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

Updated Date - Feb 28 , 2026 | 12:47 AM