Share News

మెగ్నీషియంతో షుగర్‌కు చెక్‌

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:29 AM

మన శరీరం ఇన్సులిన్‌ను సజావుగా ఉపయోగించుకుని, రక్తంలోని చక్కెరను సంతులనంగా ఉంచడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు. ఈ పోషకం...

మెగ్నీషియంతో షుగర్‌కు చెక్‌

తెలుసుకుందాం

మన శరీరం ఇన్సులిన్‌ను సజావుగా ఉపయోగించుకుని, రక్తంలోని చక్కెరను సంతులనంగా ఉంచడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు. ఈ పోషకం మనకెన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటంటే...

ఇన్సులిన్‌ సెన్సిటివిటీ: కణాలు ఇన్సులిన్‌కు మెరుగ్గా స్పందించి, వాటిలోకి గ్లూకోజ్‌ చేరుకోడానికి మెగ్నీషియం సహాయపడుతుంది

రక్తంలో చక్కెర: రక్తంలో చక్కెరలు పెరిగిపోకుండా నియంత్రించి, చక్కెర మోతాదులను స్థిరంగా ఉంచుతుంది

కండరాలు: శక్తి కోసం, కోలుకోవడం కోసం కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను సజావుగా శోషించుకోడానికి సహాయపడుతుంది

ఎలా పని చేస్తుంది?

పిండిపదార్థాలు తిన్నప్పుడు, వాటిలోని గ్లూకోజ్‌ను కణాల్లోకి చేర్చడం కోసం శరీరంలో ఇన్సులిన్‌ విడుదలవుతుంది. ఈ సమయంలో గ్లూకోజ్‌ చొరబడడానికి వీలుగా కణాలను అన్‌లాక్‌ చేయడంలో మెగ్నీషియం ఇన్సులిన్‌కు తోడ్పడుతుంది. అయితే మధుమేహుల్లో కణాలు ఇన్సులిన్‌కు ప్రతిస్పందించకుండా, గ్లూకోజ్‌ను తమ లోపలకు చొరబడనీయవు. దాంతో కణాల్లోకి చొరబడలేని గ్లూకోజ్‌ రక్తంలోనే నిల్వ ఉండిపోయి, రక్తంలో చక్కెర మోతాదును పెంచేస్తుంది. నిరంతర ఒత్తిడి ఈ పరిస్థితికి దారి తీయవచ్చు. అలాగే అస్తవ్యస్థ ఆహార, జీవనశైలులు కూడా ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను పెంచుతాయి. కాబట్టి ఒత్తిడి తొలగించుకుని, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తూ, క్రమం తప్పక వ్యాయామం చేయడం అవసరం. అలాగే వైద్యుల సూచన మేరకు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను తొలగించే మెగ్నీషియం సప్లిమెంట్లను కూడా వాడుకోవాలి.

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 12:29 AM