Share News

నిమ్మతొక్కలతో నిగారించేలా

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:57 AM

నిమ్మతొక్కల్లో యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలను తొలగించడంలో బాగా పనిచేస్తాయి....

నిమ్మతొక్కలతో నిగారించేలా

నిమ్మతొక్కల్లో యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలను తొలగించడంలో బాగా పనిచేస్తాయి. చర్మం సహజ కాంతితో నిగారించేందుకు తోడ్పడతాయి.

  • నిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టి మెత్తటి పొడిలా చేయాలి. ఒక గిన్నెలో చెంచా నిమ్మ తొక్కల పొడి, చెంచా తేనె, మూడు చెంచాల గులాబీ నీళ్లు వేసి కలపాలి. ఈ పేస్టును మాఖానికి పట్టించి పావు గంటసేపు ఆరనిచ్చి ఆపైన గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం బిగుతుగా మారి ముఖం తాజాగా కనిపిస్తుంది.

  • వెడల్పాటి గిన్నెలో కొన్ని నిమ్మతొక్కలు వేసి అవి మునిగేవరకూ నీళ్లు పోసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీళ్లను ఓ స్ర్పే బాటిల్‌లోకి వడబోయాలి. ఇది మంచి టోనర్‌లా పనిచేస్తుంది. రోజూ రాత్రి పడుకునేముందు ముఖంపై ఈ నీటిని స్ర్పే చేసుకుంటే చర్మ రంధ్రాలు తెరచుకుని శుభ్రపడతాయి. మొటిమలు, మచ్చల బాధ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్

Updated Date - Apr 22 , 2026 | 04:58 AM