జెట్ ఫాసెట్‌తో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:14 AM
డాక్టర్! తరచూ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. వైద్యులు సూచించే జాగ్రత్తలన్నీ తీసుకున్నా, ఈ సమస్య నన్ను పదే పదే వేధిస్తూనే ఉంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు?...
కౌన్సెలింగ్
డాక్టర్! తరచూ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. వైద్యులు సూచించే జాగ్రత్తలన్నీ తీసుకున్నా, ఈ సమస్య నన్ను పదే పదే వేధిస్తూనే ఉంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు?
ఓ సోదరి, హైదరాబాద్.
మనం మూత్రవిసర్జన తర్వాత, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవడం కోసం జెట్ ఫాసెట్స్‌ను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ జెట్ ఫాసెట్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామా? దాన్లో నుంచి వేగంగా చిమ్మే నీళ్ల మీదే దృష్టి పెడతాం తప్ప, రంథ్రాల దగ్గర, లోపల పేరుకునే ఫంగస్, పాచి గురించి పట్టించుకోం! రోజుల తరబడి నీరు, తేమ నిల్వ ఉండే ప్రదేశాల్లో ఫంగస్, వ్యాధికారక సూక్ష్మక్రిములు పెరుగుతాయనే విషయం మనందరికీ తెలుసు. అలా జెట్ ఫాసెట్‌లోకి కూడా సూక్ష్మక్రిములు చేరుకుని, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను పెంచుతూ ఉంటాయి. కాబట్టి వాటిని తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే మూత్రవిసర్జన చేసిన ప్రతిసారీ నీళ్లతో శుభ్రం చేసుకోవలసిన అవసరం లేదు. నిజానికి మూత్రం స్టెరైల్ ద్రవం. కాబట్టి ఆ ప్రదేశాన్ని టాయ్‌లెట్ పేపర్‌తో అద్దుకుంటే సరిపోతుంది. జెట్ ఫాసెట్‌తో మరొక ఇబ్బంది కూడా ఉంటుంది. దీన్లో నుంచి వేగంగా బయటకు చిమ్మే నీరు, సున్నితమైన యూరినరీ ఏరియాను బలంగా తాకుతుంది. దాంతో ఆ ప్రదేశం మైక్రో ట్రామాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మూత్రవిసర్జన తర్వాత జెట్ ఫాసెట్‌కు బదులుగా టాయిలెట్ పేపర్ వాడడం అలవాటు చేసుకోవాలి. జెట్ ఫాసెట్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
డాక్టర్ ఆశిష్ పరదేశి,
కన్సల్టెంట్ యూరాలజిస్ట్, పూణె.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..