Share News

బెల్లమే బెస్ట్‌

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:06 AM

స్వీట్లు, చిక్కీలు, సున్నుండలు తదితర తీపి పదార్థాల తయారీ కోసం చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే...

బెల్లమే బెస్ట్‌

స్వీట్లు, చిక్కీలు, సున్నుండలు తదితర తీపి పదార్థాల తయారీ కోసం చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చక్కెరలో కేలరీలు మాత్రమే ఉంటాయి. బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, సిలీనియం లాంటి పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలిసి శరీరానికి ఎటువంటి అనారోగ్యమూ కలుగకుండా కాపాడుతాయి. బెల్లాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...

  • బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ వేగవంతమవుతుంది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

  • రక్త హీనత, కీళ్ల నొప్పులు, రక్తపోటు తగ్గుతాయి. ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి.

  • చిన్న బెల్లం ముక్క మీద కొద్దిగా మిరియాలపొడి చల్లుకుని తింటే శ్వాసకోశాల్లో శ్లేష్మం ఉత్పత్తి కాకుండా ఉంటుంది. దీంతో ఆస్తమా, జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం లాంటి సమస్యలు తొలగిపోతాయి.

  • మహిళల్లో కడుపు నొప్పి, అధిక రక్తస్రావం లాంటి నెలసరి సమస్యలు తగ్గుతాయి.

  • శరీరంలో పేరుకునే టాక్సిన్లను బయటికి పంపడంలో బెల్లం ప్రధానపాత్ర పోషిస్తుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు, గుల్లలు, నల్లమచ్చలులాంటివి ఏర్పడవు. చర్మం బిగుతుగా, కాంతివంతంగా మారుతుంది.

  • బెల్లం.. శరీర బరువును నియంత్రణలో ఉంచడంతోపాటు స్థిరంగా శక్తిని అందిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఉత్సాహకరమైన అనుభూతినిస్తుంది.

  • రాత్రి పడుకునేముందు ఒకగ్లాసు గోరువెచ్చటి పాలలో చెంచా బెల్లం పొడి చిటికెడు మిరియాలపొడి కలుపుకుని తాగితే హాయిగా నిద్ర పడుతుంది.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 01:06 AM