Share News

ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌తో సమస్యలు

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:29 AM

చిటికెలో సిద్ధమైపోయే ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. పిల్లల్ని ఉదయాన్నే బడికి సిద్ధం చేసే హడాహుడిలో ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ తినిపించేయడం లేదా లంచ్‌ బాక్స్‌లో...

ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌తో సమస్యలు

మీకు తెలుసా?

చిటికెలో సిద్ధమైపోయే ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. పిల్లల్ని ఉదయాన్నే బడికి సిద్ధం చేసే హడాహుడిలో ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ తినిపించేయడం లేదా లంచ్‌ బాక్స్‌లో నూడుల్స్‌ సర్దేయడం పరిపాటిగా మారుతోంది. ఈ ధోరణితో భవిష్యత్తులో పిల్లలు మెటబాలిక్‌ డిజార్డర్ల బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లలకు వారానికి రెండు కంటే ఎక్కువ సార్లు నూడుల్స్‌ తినిపించడం వల్ల మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ముప్పు 68ు మేరకు పెరుగుతుంది. ఫలితంగా తక్షణ పర్యవసానాలు కనిపించకపోయినా, దీర్ఘకాలంలో గుండె జబ్బులు, గుండెపోటు, మధుమేహం, ఒబేసిటీ ముప్పులు తప్పవు. నూడుల్స్‌లోని అనారోగ్యకరమైన పదార్థాలే ఇందుకు ప్రధాన కారణం. అవేంటో తెలుసుకుందాం...

  • ఒక నూడుల్స్‌ ప్యాకెట్‌లో 1875 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఇది దైనందిన పరిమితి 1500 మిల్లీగ్రాముల కంటే 375 మిల్లీగ్రాములు ఎక్కువ. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది

  • సాధారణంగా నూడుల్స్‌ శుద్ధి చేసిన మైదాపిండితో తయారవుతాయి. ఇది అత్యధిక గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది

  • అనేక నూడుల్స్‌ బ్రాండ్లు, నూడుల్స్‌ తయారీలో పామాయిల్‌ను ఉపయోగిస్తాయి. దీన్లోని ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

తీవ్ర ముప్పులు ఇవే!

మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఒక వ్యాధి కాదు. ఐదు అంశాల కలబోతతో తలెత్తే ఆరోగ్య సమస్య. కాబట్టి గుండెపోటు, మధమేహం, ఒబేసిటీలకు దారితీసే కొన్ని రిస్క్‌ ఫ్యాక్టర్ల మీద ఓ కన్నేసి ఉంచడం అవసరం. అవేంటంటే...

- పొత్తికడుపు: మహిళల నడుము చుట్టుకొలత 35 అంగుళాలు, పురుషుల నడుము చుట్టుకొలత 40 అంగుళాలు దాటకూడదు.

- ట్రైగ్లిజరైడ్స్‌: ఒక డెసిలీటరుకు 150 మిల్లీగ్రాములకు మించకూడదు.

- మంచి కొలెస్ట్రాల్‌: మహిళల్లో ఒక డెసిలీటరుకు 50 మిల్లీగ్రాములు, పురుషుల్లో ఒక డెసిలీటరుకు 40 మిల్లీగ్రాములకు మించకూడదు.

- అధిక రక్తపోటు: 130/85కు మించకూడదు.

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 02:29 AM