కొమ్మ ఉంటే చాలు...
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:42 AM
ఇంట్లో తాజదనాన్ని నింపి మనసుకు అహ్లాదాన్ని పంచే ఇండోర్ మొక్కలను పెంచడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. ప్రతిసారీ విత్తనాలు కొనక్కర్లేదు...
ఇంట్లో తాజదనాన్ని నింపి మనసుకు అహ్లాదాన్ని పంచే ఇండోర్ మొక్కలను పెంచడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. ప్రతిసారీ విత్తనాలు కొనక్కర్లేదు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మొక్కల కొమ్మలనుంచే కొత్త వాటిని సృష్టించవచ్చు.
మనీ ప్లాంట్: పచ్చగా పొడవుగా పెరిగిన తీగ నుంచి కనీసం రెండు కణుపులు ఉండేలా కొమ్మను కత్తిరించాలి. రెండు ఆకులు ఉంచి మిగిలిన వాటిని తుంచేయాలి. ఈ కొమ్మను నీళ్ల గ్లాసులో ఉంచాలి. రోజూ నీళ్లు మారుస్తుంటే కొమ్మ కింది భాగంలో వారం లోపే కొత్త వేర్లు వచ్చేస్తాయి. ఆపైన చిన్న కుండీలో నాటుకుంటే కొత్త మొక్క చక్కగా పెరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా.. ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ రంగుల కలయికతో అందంగా కనిపించే ‘కోలియస్’, గుండె ఆకారంలో ఉండే ఆకులతో నిండిన ‘ఫిలోడెండ్రాన్’ మొక్కలను కూడా పెంచుకోవచ్చు.
జేడ్ ప్లాంట్: ఆకులతో నిండిన చిన్న కాండాన్ని కణుపు ఉండేలా కత్తిరించి నేరుగా కుండీలో నాటాలి. కొమ్మకు రోజూ కనీసం ఆరుగంటలు ప్రకాశవంతమైన వెలుతురు తగిలేలా చూసుకోవాలి. లివింగ్ రూమ్ లేదా స్టడీ రూమ్‌లో కిటికీల దగ్గర కుండీని ఉంచడం మంచిది. మట్టి తేమగా ఉండేలా కుండీలో నీటిని చిలకరిస్తుండాలి. కొత్త వేర్లు, దుంపలు పెరగడానికి నెలపైనే పడుతుంది. ఈ విధంగానే.. బాణం లాంటి ఆకులతో కనిపించే ‘సింగోనియం’, రంగు రంగుల ఆకులతో ఆకర్షణీయంగా ఉండే ‘ట్రేడ్స్‌కాంటియా’ మొక్కలనూ సులువుగా పెంచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్