Share News

వీటిని పిల్లలకు నేర్పించాల్సిందే...

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:47 AM

పిల్లలకు బాధ్యత తెలిసేలా పెంచడం... తల్లిదండ్రుల విధి. ఈ క్రమంలో పిల్లలకు ఏ అంశాల్లో అవగాహన కల్పించాలో తెలుసుకుందాం..!...

వీటిని పిల్లలకు నేర్పించాల్సిందే...

పిల్లలకు బాధ్యత తెలిసేలా పెంచడం... తల్లిదండ్రుల విధి. ఈ క్రమంలో పిల్లలకు ఏ అంశాల్లో అవగాహన కల్పించాలో తెలుసుకుందాం..!

  • పిల్లలకు డబ్బు విలువ, ఇంటి ఖర్చులు, పొదుపు గురించి సమగ్రంగా తెలియజేయాలి. అప్పుడే వారికి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.

  • సమయపాలన గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. సమయానుసారం పడుకోవడం. నిద్ర లేవడం, చదువుకోవడం, వ్యాయామం చేయడం లాంటివి నేర్పించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయానికి మార్గం సులువవుతుందని తెలియజేయాలి.

  • పిల్లలకు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం ఇవ్వాలి. ఇతరుల మనసు నొప్పించకుండా భావ వ్యక్తీకరణ విధానాన్ని నేర్పించాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగ్గా ఉంటే పిల్లలు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. భావోద్వేగాలను నియంత్రణలో ఎలా ఉంచుకోవాలో తెలియజెప్పాలి.

  • పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం తీసుకోవడం, క్రమశిక్షణల ఆవశ్యకతను వివరించి చెప్పాలి.

  • పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిలో నిర్ణయాత్మక ధోరణి మెరుగుపడేలా అవగాహన కల్పించాలి. సమస్యలను సొంతంగా ఎలా పరిష్కరించుకోవాలో నేర్పించాలి.

  • డిజిటల్‌ స్ర్కీన్‌ వల్ల కలిగే నష్టాలను పిల్లలకు వివరించి చెప్పాలి. మొబైల్‌, ల్యాప్‌టాప్‌లను నిర్ణీత సమయం వరకు మాత్రమే వినియోగించాలని షరతు పెట్టాలి.

ఇవి కూడా చదవండి..

ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ

Updated Date - Mar 08 , 2026 | 01:47 AM