కరివేపాకు తాజాగా...
ABN , Publish Date - Jul 22 , 2026 | 01:13 AM
వంటల్లో విరివిగా ఉపయోగించే కరివేపాకు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు ఎలాంటి నిల్వ పద్ధతులు అనుసరించాలో చూద్దాం...
వంటల్లో విరివిగా ఉపయోగించే కరివేపాకు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు ఎలాంటి నిల్వ పద్ధతులు అనుసరించాలో చూద్దాం...
కరివేపాకును తెచ్చిన తరువాత శుభ్రంగా కడిగి పొడిగా అయ్యేవరకు ఆరబెట్టాలి. ఏ మాత్రం తడి మిగిలి ఉన్నా ఆకులపై నల్ల మచ్చలు వచ్చేస్తాయి. తరువాత గాలి చొరబడని డబ్బాలో లేదంటే జిప్ లాక్ కవర్లో టిష్యూ పేపర్‌ను పరిచి కరివేపాకును నింపి పైన మరో టిష్యూని ఉంచి ఫ్రిజ్‌లో పెడితే ఆరు వారాలపాటు దాని తాజాదనం నిలిచి ఉంటుంది. టిష్యూ పేపర్లు తడిసినట్లు కనిపిస్తే వాటిని వెంటనే మార్చేయాలి.
కరివేపాకును కాగితం కవర్లో లేదా పలుచని గుడ్డలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచినా చాలా రోజులపాటు తాజాగా సువాసనభరితంగా ఉంటుంది.
కరివేపాకు ఆకులను ఐస్ ట్రేలో ఉంచి నిండా నీళ్లు పోసి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. ఐస్‌క్యూబ్స్ తయారైన తరువాత వాటిని జిప్‌లాక్ కవర్లో వేసి ఫ్రీజర్లో నిల్వ చేయాలి. అవసరమైనప్పుడు ఒక్కో క్యూబ్‌ను తీసుకోవచ్చు.
ఒక మామూలు ప్లాస్టిక్ డబ్బాలో పలుచని కాగితాన్ని ఉంచి అందులో కరివేపాకులు వేసి పైన మరో కాగితాన్ని కప్పి మూత బిగించి ఫ్రిజ్‌లో ఉంచితే ఇరవై రోజుల వరకు అవి తాజాగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్
12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..