క్యాలీఫ్లవర్లో పురుగులా..?
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:34 AM
క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు, వాటి గుడ్లు దాగి ఉంటాయి. వీటన్నింటినీ సులువుగా తొలగించే ఇంటి చిట్కాలివే...
క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు, వాటి గుడ్లు దాగి ఉంటాయి. వీటన్నింటినీ సులువుగా తొలగించే ఇంటి చిట్కాలివే...
ముందుగా క్యాలీఫ్లవర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా విడదీయాలి. వెడల్పాటి పెద్ద గిన్నెలో గోరువెచ్చటి నీటిని పోసి చెంచా ఉప్పు, అర చెంచా పసుపు వేసి బాగా కలపాలి. తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి పావుగంటసేపు ఉంచాలి. వాటిలో దాగిన చిన్న చిన్న పురుగులన్నీ బయటికి వచ్చి నీటి అడుగుకు చేరతాయి. ఆపైన క్యాలీఫ్లవర్ ముక్కలను మరోసారి మంచి నీటితో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోస్తే సరిపోతుంది
గిన్నెలో సగానికిపైగా వేడి నీటిని తీసుకుని అందులో రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్, చెంచా బేకింగ్ సోడా వేసి కలపాలి. ఆపైన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి పది నిముషాలు ఉంచితే పురుగులన్నీ బయటికి వచ్చేస్తాయి. ఆపైన క్యాలిఫ్లవర్ ముక్కలను మరోసారి మంచినీటితో కడిగితే చాలు.
క్యాలీఫ్లవర్‌ను కొనేటప్పుడు గట్టిగా లేత క్రీమ్ కలర్లో ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దానిపై నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఉంటే లోపల పురుగులు ఉండవచ్చని భావించాలి. అలాంటివాటిని కొనకూడదు.
ఈ వార్తలు కూడా చదవండి
జోర్డాన్‌లో చర్చిపై కాల్పులు.. ఏడుగురి మృతి, 40 మందికి గాయాలు
వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం..